టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా చిరు సరసన కాజల్ నటిస్తుండగా చరణ్ సరసన అందాల బామ పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఇక విషయం ఏంటంటే..? దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఆకట్టుకునే నీలాంబరీ.. నీలాంబరీ.. లేరేవ్వరే నీలామరీ.. అంటూ సాగే మెలోడి సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ పాటలో చరణ్ స్టేప్ లతో పూజా హెగ్డే అందంతో ఆకట్టుకుంటున్నారు. కాగా ఈ పూర్తి సాంగ్ ను నవంబర్ 5 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో సాంగ్ యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిరు సినిమాలో చరణ్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.