ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ 5 తెలుగు విన్నర్ వీజే సన్నీ గురించే. వీజే సన్నీగా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టి విన్నర్ సన్నీగా నిలిచాడు. సన్నీ గెలుపునకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అతని యాటిట్యూడ్. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సన్నీ నందమూరి బాలకృష్ణ అభిమాని. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లకముందు కూడా ఈ విషయాన్ని సన్నీ చాల సార్లు చెప్పాడు.
బాలయ్యపై తనకున్న అభిమానాన్ని అనేక సందర్భాల్లో బయటపెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న సమయంలో కూడా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ఇంటర్వ్యూకు వచ్చిన సమయంలో.. ఆమెను తెలుగు హీరోల్లో ఎవరు బాగా ఇష్టమని అడిగిన సమయంలో.. ‘దబిడి దిబిడే’ అని అరిచి.. ఆలియాకు హింట్ ఇచ్చాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో కూడా ఆలియా దబిడి దిబిడే అంటూ హంగామా చేశారు. అలాగే హౌస్‌లో పోయిన వారం.. ఐదుగురు కంటెస్టెంట్లు హీరోల వేషం వేయాల్సి వచ్చింది. అప్పడు కూడా సన్నీ తన అభిమాన హీరో బాలయ్య లెజెండ్ సినిమాలోని గెటప్ వేసి అదరగొట్టాడు.
ఈ ఎపిసోడ్‌తో బాలయ్య అభిమానులకు సన్నీ మరింత దగ్గరయ్యాడు. బాలకృష్ణ డైలాగులను అనర్గళంగా చెప్పగలడు సన్నీ. తన అభిమాన హీరోకు ఫ్యాన్ అయిన సన్నీ గెలుపును బాలయ్య ఫ్యాన్స్ కూడా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. సన్నీ గెలిచేందుకు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి సన్నీకి బాలయ్యపై ఉన్న అభిమానం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ 5 విన్నర్.. VJ సన్నీ హీరోగా మూవీ!