Bayilvan Ranganathan: నటి రేఖ నాయర్ పై కామెంట్లు చేస్తూ ప్రముఖ నటుడు బయిల్‌వాన్ రంగనాథ్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ‘ఇరవిన్ నిగల్’ సినిమాలో రేఖ పాత్ర, సహ నటి చిత్రతో ఆమె సంబంధంపై ఆయన సంచలన కామెంట్లు చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో రంగనాథ్, రేఖల మధ్య వివాదానికి దారి తీసింది. తాజాగా, చెన్నై బీచ్‌లో జాగింగ్‌కు వెళ్లిన రేఖకు రంగనాథ్ ఎదురుపడ్డారు.
ఆయన్ని చూడగానే ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో గురించి ఆయన్ని నిలదీశారు. ‘‘ ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇంట్లో ఆడవాళ్ల గురించి ఇలాగే మాట్లాడతారా?.. మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా?.. విషయం తెలియకుండా మాట్లాడకూడదు. నేను సినిమాలో ఎలాగైనా నటిస్తాను.. అలాగని ఎలా పడితే అలా మాట్లాడతారా?. ఇలా చేస్తే మీ వయసుకు కూడా మర్యాద ఇవ్వను. చెప్పు తెగుతుంది’’ అంటూ మండిపడ్డారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, నటుడు రంగనాథ్‌కు వివాదాలు కొత్తకాదు. గతంలోనూ పలువురు నటీమణులపై కామెంట్లు చేసి ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. తాజా వివాదంతో మరోసారి తెరపైకి వచ్చారు. మరి, రేఖ, రంగనాథ్‌ల గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రముఖ ఓటిటి సంస్థలకు ‘థ్యాంక్యూ’ మూవీ హక్కులు .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?