సూపర్ స్టార్ మహేశ్ బాబు- కీర్తీ సురేశ్ జంటగా.. పరశురామ్ డైరెక్షన్ లో విడుదలైన సర్కారు వారి పాట సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే 108 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా థియేటర్లలో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ మూవీలో డైలాగ్స్, మహేశ్ స్వాగ్ అన్నీ పోకిరిలో మహేశ్ ని గుర్తుచేస్తున్నాయంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఓవర్సీస్ లోనూ సర్కారు వారి పాట సినిమా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. నార్త్ అమెరికాలో(అమెరికా+కెనడా)లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్స్(15.64 కోట్లు) కలెక్షన్స్ దాటేసింది. ఓవర్సీస్‌లో మహేశ్ సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసినట్లు అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి కంటే సక్సెస్ మీట్ లో మహేశ్ డాన్స్ వేయడమే ఎక్కువగా వైరల్ అవుతోంది. అయితే ఎప్పుడూ లేనిది మహేశ్ ఎందుకు డాన్స్ వేశాడంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు.
అవును ఎప్పుడూ స్టేజ్ మీద ఓ పది నిమిషాలు మాట్లాడాలన్నా మహేశ్ బాగా ఇబ్బంది, మొహమాటం ఫీల్ అవుతుంటాడు. కానీ, సోమవారం జరిగిన సక్సెస్ మీట్ లో ఏకంగా డాన్స్ చేసేశాడు. అది చూసిన ఫ్యాన్స్ ఆనందంతో పాటు ఎంతో ఆశ్చర్యానికి కూడా గురయ్యారు. అసలు మహేశ్ ఎందుకు డాన్స్ చేసి ఉంటాడని అంతా ఆలోచనలో పడ్డారు. అయితే అందుకు కారణం లేకపోలేదు.. మహేశ్ డాన్స్ చేయడం వెనుక ఒక పెద్ద కారణం ఉందనే టాక్ బాగా వినిపిస్తోంది. అదేంటంటే.. సర్కారు వారి పాట సినిమా స్టార్ట్ అయ్యాక కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. మహేశ్ రెండేళ్లకు పైనే ఈ స్క్రిప్ట్ తో ట్రావెల్ చేశాడు. ఒక్క మహేశ్ బాబు మాత్రమే కాదు, డైరెక్టర్, నిర్మాతలు ఇలా అందరూ చాలా క్రిటికల్ సమయాల్లో ఎంతో కష్టపడి ఈ సినిమా తీసి.. ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదల చేశారు.
ఇదీ చదవండి: కాపీ ట్యూన్‌పై తమన్ కామెంట్స్ వైరల్.. చాలా జాగ్రత్తలు తీసుకుంటాను!థియేటర్లలో విడుదల తర్వాత సర్కారు వారి పాట సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్, ప్రేక్షకులు మహేశ్ కెరీర్లో మరో మంచి హిట్ పడింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి చాలా మంది పనిగట్టుకుని నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. కేవలం 4 రోజుల్లో రూ.145 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా, విపత్కర పరిస్థితుల్లో అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేస్తే.. కొందరు పని గట్టుకుని నెగెటివ్ ప్రచారాలు చేయడం మహేశ్ దాకా వెళ్లింది. ఇంత మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.. అయినా ఇలా ఎందుకు చేస్తున్నారని మహేశ్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరెన్ని ప్రచారాలు చేసినా సర్కారు వారి పాట సినిమాని ప్రేక్షకులు మంచి హిట్ చేశారనే ఆనందం, ట్రోలర్స్ సమాధానంగానే మహేశ్ బాబు సక్సెస్ మీట్ లో డాన్స్ చేశాడని తెలుస్తోంది. కానీ, తన కెరీర్లో మహేశ్ బాబు తొలిసారి ఓ సక్సెస్ మీట్ లో ఓ పాటకు కాలు కదపడం చూసి ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు చేసిన ఆ డాన్సు మూవ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. మహేశ్ బాబు సక్సెస్ మీట్ లో డాన్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.