హెడ్డింగ్ చూడగానే.. ఇప్పుడు రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఏంటి.. అయినా ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది.. ఇక రామ్ చరణ్ ప్రచారం చేస్తే.. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన తరఫునే ప్రచారం చేస్తారు కదా అనే అనుమానం వస్తుంది. అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడా ఎన్నికలు లేవు.. మరి ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అదే ఇక్కడ ట్విస్ట్.. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తుంది నిజ జీవితంలో కాదు.. స్క్రీన్ మీద. ప్రస్తుతం రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. RC 15 చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్.. రాజమండ్రి.. గోదావరి తీర ప్రాంతంలో జరుగుతుంది.
ఇక RC 15 సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌కు సంబంధించిన సీన్స్.. షూటింగ్ జరుగుతుంది. సినిమాలో భాగంగా.. రామ్ చరణ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఆర్‌సీ 15 చిత్రంలో.. ఫ్లాష్ బ్యాక్‌లో రామ్ చరణ్ పాత్ర ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని.. ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. అందులో భాగంగా ఆయన పార్టీ గుర్తు ట్రాక్టర్ అని తెలుస్తుంది. తాజాగా సినిమాలో ఎన్నికల షెడ్యూల్‌కి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. దానిలో భాగంగా.. రామ్ చరణ్.. తన ట్రాక్టర్ గుర్తుకి ఓటు వేయాలని ప్రజలను రిక్వెస్ట్ చేసే సన్నివేశాలను శంకర్ తెరకెక్కించారు. డిసెంబర్ 25 వరకు ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం.
RC 15 చిత్రంలో.. రామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నారు. ఓ పాత్రలో ముఖ్యమంత్రిగా అయితే మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపిస్తారు. అంతేకాక.. ఈ చిత్రంలో చరణ్.. 27 గెటప్స్‌లో కనిపిస్తారని.. ఇప్పటికే జోరుగా ప్రచారం అవుతోంది. పైగా ఈ 27 గెటప్స్‌లో భాగంగా.. ఓ హిస్టారికల్ రోల్‌లోనూ చరణ్ కనిపంచబోతున్నారట. ఇంతకీ ఆ పాత్ర ఏది అంటే.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అట. ప్రస్తుతానికి ఈ వార్త ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం అవుతోంది. మరి ఈ పాత్ర వ్యవధి ఎంత సేపు ఉంటుందనేది చూడాలి.
స్టార్ డైరెక్టర్ శంకర్‌తో RC 15 సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. టాలీవుడ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్.. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రంలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.