అతడు చనిపోయిన పరిస్థితి అనుమానంగా ఉందంటూ ఫ్యాన్స్ అంటున్నారు. ‘ఉరి వేసుకుంటే కాళ్లు నేలకు తాకి ఎలా ఉంటాయి? శరీరం మీద, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉంటాయి?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. తూ.గో. జిల్లాలోని కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్ చిన్నప్పటినుంచి జూ.ఎన్టీఆర్‌కు వీరాభిమాని. దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూ.ఎన్టీఆర్‌తో ఫొటో దిగడానికి ప్రయత్నించి బౌన్సర్లతో దెబ్బలు తిన్నాడు. ఆ సమయంలో జూ.ఎన్టీఆర్.. శ్యామ్‌ను పిలిచి మరీ ఫొటో దిగాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్యామ్‌కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. అలాంటి శ్యామ్ తాజాగా, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అతడు చనిపోయిన పరిస్థితి అనుమానంగా ఉందంటూ ఫ్యాన్స్ అంటున్నారు. ‘ఉరి వేసుకుంటే కాళ్లు నేలకు తాకి ఎలా ఉంటాయి? శరీరం మీద, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉంటాయి? జేబులో గంజాయి పేకేట్లు ఉంటే ఆ మతుల్లో ఉరి ఎలా వేసుకుంటాడు? హ్యాండ్ కట్ చేసుకుంటే అంత నిలకడగా ఉరి ఎలా వేసుకుంటాడు? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే చనిపోయిన శ్యామ్ కుటుంబాన్ని ఆదుకోవటానికి జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ‘రా ఎన్టీఆర్’ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది.
శ్యామ్ చెల్లెలు బాధ్యత తమదే నని ఆ ఫ్యాన్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ‘‘ పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము. శ్యామ్ కుటుంబాన్ని ఆదుకుంటాం. అన్ని విధాలుగా ధైర్యం ఇస్తాం. శ్యామ్ లేని లోటును కుటుంబానికి కలగనివ్వం. శ్యామ్ చెల్లెలి బాధ్యత మేమే తీసుకుంటున్నాము’’ అని పేర్కొంది. మరి, చనిపోయిన శ్యామ్ కుటుంబాన్ని రా ఎన్టీఆర్ ఆదుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Harish Shankar .S (@harish2you) June 27, 2023