తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల పలువురు హీరోలు షూటింగ్ సమయాల్లో గాయాలపాలవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ ఐదు పదులు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలా కనిపిస్తాడు. తెరపై తన ఎనర్జీతో ఉర్రూతలూగిస్తుంటారు. ఈ ఏడాది రవితేజ నటించిన ఖిలాడి మూవీ పెద్దగా విజయం అందుకోలేకపోయింది. ప్రస్తుతం రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్ర షూటింగ్‌లో గాయపడినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
మాస్ మహరాజ రవితేజ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రవితేజ ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చాలా సెలెక్టీవ్ గా మూవీల్లో నటిస్తున్నారు. ప్రయోగాత్మకంగా నటనకు స్కోప్ ఉన్న చిత్రాలపై ఆయన ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పటి గజదొంగ నాగేశ్వర రావు జీవితకథ ఆధారంగా ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో రవితేజ గాయపడ్డట్లు తెలుస్తుంది. ఆయన చేతికి పది కుట్లు కూడా వేశారని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో ఆయన రెండు నెలల వరకు రెస్ట్ తీసుకోవాలి అని వైద్యులు సూచించారట.
రవితేజకు గాయం అయినప్పటికీ రెండు రోజులు రెస్ట్ తీసుకొని తిరిగి షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సహా ఇతర నటులు, సాంకేతిక నిపుణుల డేట్స్‌లో మార్పు రాకూడదని, నిర్మాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఇలా చేశారని చెప్తున్నారు. రవితేజ అభిమానులు కాస్త కంగారు పడినా సరే తమ అభిమాన హీరో ప్రస్తుతానికి బాగానే ఉన్నాడన్న విషయం తెలుసుకొని కుదుట పడ్డారు. నిజంగా రవితేజ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు అభిమానులు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.