నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం అవుతున్న టాక్ షో అన్‌స్టాపబుల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ప్రముఖను గెస్ట్‌లుగా పిలిచి రచ్చ చేసిన బాలయ్య.. రీసెంట్‌గా మాస్‌మహారాజా రవితేజ, డైరెక్టర్ మలినేని గోపిచంద్‌ను గెస్టులగా పిలిచారు. వీరి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్‌లో బాలయ్య రీసెంట్ హిట్ అఖండలోని యా.. యా.. జై బాలయ్య పాటకు రవితేజ స్టెప్పులేసి అదరగొట్టాడు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి బాలయ్య పాటకు రవితేజ స్టెప్పులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.