ఫిల్మ్ డెస్క్- బుల్లితెర యాంకర్ రవి, మరో యాంకర్ లాస్య గురించి తెలుసు కదా. టీవీ ప్రేక్షకుల్లో వీరిద్దరు తెలియని వారుండరనుకొండి. ఇక వీరిద్దరి బంధానికి దాదాపు పదేళ్ల వయస్సు ఉంటుంది. ఒకప్పుడు సంథింగ్ స్పెషల్ అంటూ టీవీలో మార్నింగ్ వచ్చే మ్యూజిక్ షోతో ఈ జోడీ ప్రయాణం మొదలైంది. అయితే ఈ మధ్య ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ రావడంతో దాదాపు ఐదేళ్ల పాటు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా రవి, లాస్య కలిసి మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఇద్దరి మధ్య గతంలో జరిగిన ఘఠనలు మరిచిపోయి మునుపటిలా మళ్లీ హంగామా చేస్తున్నారు. కామెడీ స్టార్స్ షోలో రవి, లాస్య చేసే కామెడీ బాగా వర్కవుట్ అవుతోంది. ఇక రవి, లాస్యలు మాట్లాడుతూ తమ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. లాస్య అలవాట్లు, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండే విషయాల గురించి రవి చాలానే చెప్పుకొచ్చాడు.
బిగ్ బాస్ ఇంట్లోనూ లాస్యను ఎంతో గమనించిన రవి.. లాస్య ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీ, తన ఊరు అంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చిందనే విషయాన్ని గుర్తుకు చేశాడు. లాస్య తనకు పదేళ్లుగా తెలుసని.. ఆమె ఇప్పుడు ఇలా కూర్చుని ఉన్నా.. మనతో మాట్లాడుతూ ఉన్నా కూడా.. ఆమె మనసులో ఎక్కడో చోట నాన్న గురించి, వారి ఊరి గురించి ఆలోచిస్తూనే ఉంటుందని చెప్పాడు రవి. ఆమె ఎప్పుడూ కూడా ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటుందని.. ఇక్కడ ఏదో ఒకటి సాధించి సొంతూరికి వెళ్లి అభివృద్ది చేద్దామనే ఆలోచనలో ఉందని తెలిపాడు రవి. ఇక మిథునం సినిమా టైపులో మా ఆయన, నేను చివరి క్షణాలు గడపాలని కలలు కంటున్నానని లాస్య మనసులో మాట చెప్పింది.