తెలుగు సినీ పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా దర్శక నటుడు రవిబాబును అనొచ్చు. ఒకవైపు నటిస్తూనే మరోవైపు తనకు నచ్చిన కథలను చిత్రాలుగా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయన. ఆయన సినిమాల్లో ఎక్కువగా పూర్ణ ప్రధాన పాత్రలో కనిపిస్తారు.
రవిబాబు.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. నటుడిగా మంచి పేరు సంపాదించిన ఆయన.. దర్శకుడిగానూ సత్తా చాటారు. కామెడీతో పాటు వైవిధ్యమైన సినిమాలకు రవిబాబు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్నారు. ‘అల్లరి’ సినిమా దగ్గర నుంచి ‘అనసూయ’, ‘అవును’ వరకు ఆయన డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తుంటారు రవిబాబు. వీలైనంత వరకు తక్కువ బడ్జెట్లో ప్రాఫిట్ జోన్లోనే ఆయన చిత్రాలు రూపొందుతుంటాయి. ఆయన తెరకెక్కించిన కొత్త చిత్రం ‘అసలు’. ఈటీవీ విన్ యాప్‌లో ఈ మూవీని విడుదల చేశారు.
రవిబాబు సినిమాల్లో మెయిన్ లీడ్‌గా ఎక్కువగా పూర్ణ కనిపిస్తుంటారు. ఇప్పుడు రిలీజైన ‘అసలు’లోనూ ఆమెనే ప్రధాన పాత్రలో నటించారు. రవిబాబు తన మూవీస్‌లో పూర్ణకు వరుసగా ఛాన్సులు ఇవ్వడంపై కొంతకాలంగా నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటిపై తాజా ఇంటర్వ్యూలో రవిబాబు క్లారిటీ ఇచ్చారు. ‘పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ నాకు ఆమెతో ఉన్న లవ్ ఎఫైర్ జనాలు అనుకునేది కాదు.. విజువలైజ్ చేసుకున్న దాని కంటే 200 శాతం బెస్ట్ ఔట్‌పుట్‌ను అందించే ప్రత్యేక నటులను డైరెక్టర్లు సాధారణంగా ఎలాగైతే ఇష్టపడతారో ఇదీ అలాంటిదే. పూర్ణ అలాంటి ఓ జెమ్’ అని రవిబాబు చెప్పుకొచ్చారు. కాగా, రవిబాబు కొత్త మూవీ ‘అసలు’ ఈటీవీ విన్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏప్రిల్ 13న విడుదల కానుంది.