సాధారణంగా సినీ సెలబ్రిటీలు కెరీర్ లో ఫేస్ చేసిన చేదు అనుభవాలను ఏదొక టైంలో బయట పెడుతుంటారు. ఇటీవల సీనియర్ నటి రవీనా టాండన్ తన జీవితంలో మర్చిపోలేని ఓ వీరాభిమానిని గుర్తుచేసుకుంది. అతని వల్ల తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పిందట. మరి రవీనా మర్చిపోలేని స్థాయిలో ఆ అభిమాని ఏం చేశాడు అనే వివరాల్లోకి వెళ్తే.. 1990లలో స్టార్ హీరోయిన్ గా రవీనా కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడు తనను ఓ అభిమాని టార్చర్ చేశాడని, ఆ టార్చర్ భరించలేక చివరికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రవీనా.
అప్పట్లో రవీనా వరుస హిట్స్ తో బాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఆ టైంలో ఆమెను చూడటానికే అభిమానులు ఇంటిముందు గేటు వద్ద బారులు తీరేవారట. అంతమంది అభిమానులలో ఒక్కడిని తలచుకుంటే తనకు భయం వేస్తోందని రవీనా చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. “అప్పట్లో నాకొక వీరాభిమాని ఉండేవాడు. నా మీద అతని అభిమానం పీక్స్ కి చేరుకొని రక్తంతో లవ్ లెటర్స్ రాసి పంపేవాడు. అలాగే గిఫ్టులు.. నగ్న చిత్రాలు.. వీడియోలు కూడా కొరియర్ లో పంపేవాడు. గంటల తరబడి మా ఇంటి గేటు వద్దే వెయిట్ చేసేవాడు. ఓ రోజు నేను నా ఫ్యామిలీతో బయటికి వెళ్తుండగా.. కారుపై రాళ్లు విసిరాడు. దీంతో నాకు భయమేసి పోలీసులకు కంప్లైంట్ చేశాను” అని చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది రవీనా.
ఇక రవీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె హీరోయిన్ గా తెలుగులో రథసారధి, బంగారు బుల్లోడు, ఆకాశ వీధుల్లో సినిమాలు చేసింది. అలాగే ఇటీవల పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కేజీఎఫ్-2’లో రమికా సేన్ పాత్రలో కనిపించి మరోసారి సౌత్ ఇండియన్ ఆడియెన్స్ ని పలకరించింది. ప్రస్తుతం రవీనా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. రవీనా మొదటి నుండి బాలీవుడ్ సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా పలు బాలీవుడ్ సినిమాలు చేస్తూ.. అడపాదడపా టీవీ షోలలో జడ్జిగా అలరిస్తోంది.