'రావణాసుర'గా రవితేజ తొలిరోజు కలెక్షన్స్ లో బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తుంది. కానీ తను హీరోగా నటించిన గత చిత్రం 'ధమాకా' ఫస్ట్ డే వసూళ్లని మాత్రం దాటలేకపోయిందని తెలుస్తోంది.
మాస్ మహారాజా రవితేజ మరో హిట్ కొట్టేశాడు! కెరీర్ లో దాదాపు ఎంటర్ టైనింగ్ రోల్స్ చేస్తూ.. ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్న రవితేజ, ‘రావణాసుర’ కోసం ఫస్ట్ టైమ్ నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించి కుమ్మేశాడు. ఈ మూవీలో లాజిక్స్ అవి కాస్త పక్కనబెడితే నార్మల్ ఆడియెన్స్.. కచ్చితంగా ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. దీంతో తొలిరోజు వసూళ్ల విషయంలో ‘రావణాసుర’ ఫుల్ గా మెప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లెక్కలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ మూవీ ఎలా ఉంది? తొలిరోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రవితేజ గత రెండు సినిమాలతో హిట్స్ అందుకున్నారు. డిసెంబరులో ‘ధమాకా’, సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో థియేటర్లలోకి వచ్చిన మాస్ మహారాజా.. ‘రావణాసుర’తో కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించారు. కొందరు హిట్ అంటుంటే.. మరికొందరు మిక్స్ డ్ టాక్ వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు వరల్డ్ వైడ్ రూ.9 కోట్లకు గ్రాస్ సాధించిందని అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రవితేజ గత చిత్రం ‘ధమాకా’తో పోలిస్తే ఇది కాస్త తక్కువ అని చెప్పాలి. ‘ధమాకా’కి తొలిరోజు రూ.10 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు దక్కాయి. అయితే ఈ వీకెండ్ పూర్తయితే గానీ ‘రావణాసుర’ కలెక్షన్స్ స్టామినా ఏంటనేది తెలుస్తుంది.
‘రావణాసుర’ స్టోరీ విషయానికొస్తే.. జూనియర్ లాయర్ రవీందర్(రవితేజ) ఒకరి దగ్గర పనిచేస్తుంటాడు. త్వరగా ఓ అమ్మాయిని పడేసి, పెళ్లి చేసుకుని, సెటిలై అయిపోవాలని చూస్తుంటాడు. అలాంటిది కొన్నిరోజులకు ఇతడి లైఫ్ లో అనుకోని టర్న్స్ ఎదురవుతాయి. మరోవైపు సిటీలో వరస హత్యలు జరుగుతూ ఉంటాయి? ఈ కేసులన్నీ కూడా రవీందర్ పనిచేస్తున్న లాయర్ కనక మహాలక్ష్మి దగ్గరకే వస్తుంటాయి. వీటివల్ల రవీందర్ ఎలా ఎఫెక్ట్ అయ్యాడు. అసలు ఇంతకీ ఈ స్టోరీలో ‘రావణాసుర’ ఎవరు? ఏంటనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. సరే ఇదంతా పక్కనబెడితే ‘రావణాసుర’ తొలిరోజు వసూళ్లపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#Ravanasura‘s arrival has been celebrated in a massive way 🔥
Maharaja’s hattrick hit collected a worldwide gross of over 9️⃣ crores+ on its first day 💥
Book your tickets!
– https://t.co/pfL6vWWyhh@RaviTeja_offl @iamSushanthA @sudheerkvarma @AbhishekPicture @itswetha14 pic.twitter.com/CTVS3n0E7h— RT Team Works (@RTTeamWorks) April 8, 2023