ప్రేక్షకులకు చూసిన సినిమాలే మళ్లీ మళ్లీ చూడటం అంటే.. చిరాకేస్తుందని అంటుంటారు. అలాంటిది రెగ్యులర్ గా ఒకే రకమైన క్యారెక్టర్స్ చేయాలన్నా.. నటీనటులకు కూడా చిరాకుగానే ఉంటుంది. ప్రెజెంట్ ఓ సాంగ్ విషయంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందాన.. అలాంటి ఇబ్బందులే పడుతుందట.
సాధారణంగా ప్రేక్షకులకు చూసిన సినిమాలే మళ్లీ మళ్లీ చూడటం అంటే.. చిరాకేస్తుందని అంటుంటారు. అలాంటిది రెగ్యులర్ గా ఒకే రకమైన క్యారెక్టర్స్ చేయాలన్నా.. నటీనటులకు కూడా చిరాకుగానే ఉంటుంది. ప్రెజెంట్ ఓ సాంగ్ విషయంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందాన.. అలాంటి ఇబ్బందులే పడుతుందట. ఛలో సినిమాతో టాలీవుడ్ డెబ్యూ చేసిన ఈ కన్నడ భామ.. మొదటి సినిమా నుండే సూపర్ హిట్స్ తో దూసుకుపోతోంది. మధ్యలో ప్లాప్స్ పడినప్పటికీ.. వెంటనే మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తూ.. తన స్టార్డమ్ ని కాపాడుకుంటోంది. పైగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది రష్మిక.
ఇక పుష్ప సినిమా వచ్చి ఏడాది పూర్తయిపోయినా.. ఆ సినిమా తాలూకు బజ్ ఇంకా సోషల్ మీడియాలో, ఫ్యాన్స్ లో కంటిన్యూ అవుతూనే ఉంది. అదీగాక ఇప్పుడు అల్లు అర్జున్, రష్మికలతో ‘పుష్ప 2’ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు సుకుమార్. అయితే.. పుష్ప సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్స్.. దేశ విదేశాలలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా సామీ సామీ.. అంటూ రష్మిక చేసిన హుక్ స్టెప్.. యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే.. సోషల్ మీడియాలో కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రష్మిక.. రెగ్యులర్ అప్ డేట్స్ తో పాటు అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో చిట్ చాట్ లో పాల్గొంటూ ముచ్చటిస్తుంది.
ఆ విధంగా రీసెంట్ గా ఫ్యాన్స్ తో ట్విట్టర్ లో కాసేపు సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘పుష్ప సినిమాలోని సామి పాటకు మీతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది’ అని అడిగాడు. అందుకు రష్మిక జవాబిస్తూ.. “సామీ సామీ పాటకు నేను ఇంకా డ్యాన్స్ చేయలేను. ఎందుకంటే.. ఇప్పటికే ఎన్నోసార్లు ఆ పాటకు డ్యాన్స్ చేశాను. ఇంకా అలాగే చేసుకుంటూ పోతే.. నాకు వయసు పైబడ్డాక బ్యాక్ పెయిన్(నడుం నొప్పి) రావడం ఖాయం. ప్రతిసారి అదే సాంగ్ కాదు.. ఈసారి ఏదైనా కొత్తగా చేద్దాం” అని చెప్పి ఫ్యాన్ ని ఖుషి చేసింది. ప్రస్తుతం ట్విట్టర్ చాట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. రష్మిక ‘పుష్ప 2’తో పాటు రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ‘యానిమల్’, నితిన్ తో మరో సినిమా చేస్తోంది. మరి రష్మిక క్రేజీ ఆన్సర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
I’ve done saami saami step tooooo many times.. that now I feel like I’ll have issues with my back when I get older.. why you do this to me re.. 🥲 let’s do something else when me meet. 😋 https://t.co/ao8ssA6HBP
— Rashmika Mandanna (@iamRashmika) March 20, 2023