కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది. ఒకప్పుడు కన్నడ హీరోయిన్ అయిన ఈ భామ ఇప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. రష్మిక మందన్నా కన్నడ మూవీ ‘కిరిక్ పార్టీ’తో సినీరంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. దీంతో వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో కానీ తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు వారిద్దరు ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి.. ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ మారింది.
ఇటీవలే రక్షిత్ నటించిన “చార్లీ” తెలుగులో కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. మూవీ ప్రమోషన్ లో రక్షిత్ శెట్టి బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో రమ్య అనే కన్నడ హీరోయిన్ ని పెళ్లాడబోతున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో రక్షిత్ స్నేహితుడు, నటుడు రిషబ్ శెట్టి స్పందిస్తూ.. “మావాడికి సాండల్‌వుడ్ గోల్డెన్ గర్ల్‌తో పెళ్లా? అని ఫక్కున నవ్వేశాడు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేస్తున్నట్లుగా రక్షిత్ రమ్యను పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు”. ఇటీవలే రక్షిత్ సైతం ఈ వార్తలపై స్పందిస్తూ ఇంతవరకు ఆమెను అసలు కలవలేదని బదులిచ్చాడు.
ఇదీ చదవండి: సోషల్ మీడియాలో సురేఖావాణి కూతురు సుప్రీత పోస్ట్ వైరల్!
కాకపోతే తాను నటించిన ‘ఉలిదవరు కందంటే’ సినిమా బాగుందని ఆమె ఓసారి తనను మెచ్చుకుందన్నాడు. అందరిలాగానే తనకు కూడా కాలేజీ రోజుల్లో రమ్య అంటే క్రష్ ఉండేదని, అంతకు మించి ఏమి లేదని చెప్పుకొచ్చాడు. దీంతో రక్షిత్ పెళ్లి వార్తలకు చెక్ పడింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.