పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన తెలుగు సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పార్ట్ 2లో హీరోయిన్ రష్మికా మందన్న పాత్రపై ట్విస్ట్ అంటూ వస్తున్న వార్తలతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు.
భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2’ ఒకటి. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీల మూవీ లవర్స్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. పుష్పరాజ్‌గా బన్నీ ప్రదర్శించిన నటవిశ్వరూపం, పాటల్లో ఆయన వేసిన స్టెప్పులు, చేసిన ఫైట్లే దీనికి కారణం. అలాగే తగ్గేదేలే అంటూ చిత్తూరు యాసలో ఆయన పలికిన సంభాషణలను మరోసారి వినేందుకు అందరూ తహతహలాడుతున్నారు. అల్లు అర్జున్‌తో పాటు శ్రీవల్లిగా ‘పుష్ప’లో రష్మికా మందన్న కనబర్చిన నటనా పటిమకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో ఆమె పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.
ఒక్క చిత్రంతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు, ఫుల్ పాపులారిటీ రావడంతో రష్మికా మందన్న సౌత్ సినిమాలు తగ్గించి బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ‘పుష్ప 2’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సీక్వెల్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న ఈ సమయంలో మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘పుష్ప’ రెండో పార్ట్‌లో రష్మికా మందన్న పాత్ర నిడివిని మేకర్స్ తగ్గించారట. ‘పుష్ప 2’లో రష్మిక కొన్ని సీన్లలో మాత్రమే కనిపిస్తారని సమాచారం. ఆమె పాత్రను మినహాయించి.. సినిమాలోని మిగిలిన ప్రధాన పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.
ఆయా పాత్రల చుట్టూ ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉండేలా ఎక్కువ సీన్లు ప్లాన్ చేశారని.. ఈ మూవీలో హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ సీక్వెన్సులు కూడా ఉంటాయని పలు వెబ్ సైట్లలో వార్తలు వస్తున్నాయి. దీంతో క్రష్మిక అభిమానులు కంగారు పడుతున్నారు. తమ ఫేవరెట్ హీరోయిన్ తెరపై కొద్దిసేపే కనిపిస్తే ఎలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఇందులో ఎంత నిజం ఉందనేది ఇంకా తెలియ రాలేదు. తన పాత్ర నిడివి తగ్గింపు అంటూ వస్తున్న వార్తలపై రష్మిక ఇంకా స్పందించలేదు. ఈ వార్తలపై రష్మిక లేదా మూవీ మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరి, ‘పుష్ప 2’లో రష్మిక క్యారెక్టర్ నిడివి తగ్గిందంటూ వస్తున్న కథనాల మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#RashmikaMandanna will receive very little screen time.#AlluArjun #Rashmika #Pushpa2#FilmyBowl https://t.co/58kYj4gRzy
— Filmy Bowl (@FilmyBowl) February 11, 2023