సెలబ్రీటిలపై చాలా రకాల రూమర్స్ వస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లపై కాస్త ఎక్కువ రూమర్లు వినిపిస్తుంటాయి. సినిమా, లవ్, పెళ్లి, బిజినేస్, రెమ్యూనరేషన్ ఇలా అనేక విషయాల్లో వారిపై రూమర్స్ వస్తుంటాయి. అలా వస్తున్న వార్తలపై వారు చాలా అరుదుగా స్పందిస్తుంటారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న తనపై వచ్చిన రూమర్ పై స్పందించింది. మరి.. ఆమెపై వచ్చిన రూమర్ ఏమిటి? ఆమె ఏం స్పందించింది? మరి.. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం…
“పుష్ప” సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఆమె హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే సౌత్ నుంచి బాలీవుడ్ అన్ని భాషల్లో నటించింది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఈక్రమంలో బాలీవుడ్ లో మంచి అవకాశాలు సంపాదించింది. ప్రస్తుతం రష్మిక మందన్న హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్ బై`తోపాటు రణ్ బీర్ కపూర్‌తో కలిసి `యానిమల్` చిత్రంలో నటిస్తుంది. దీనికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఆమెపై రూమర్ల చక్కర్లు కొడుతున్నాయి. ఆమె మరో ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యిందని, ఓ యంగ్ హీరోతో రొమాన్స చేయబోతుందని రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.
వీటిపై తాజాగా ఈ బ్యూటీ స్పందించింది. ఆ హీరోతో రోమాన్స్ చేయబోతున్నది నిజమే అని తెలిపింది. అంతే కాక ఆ హీరో ఎవరో కాదు టైగర్ ష్రాఫ్ అని తెలిపింది. వీరిద్దరు కలిసి చేస్తున్నది సినిమా కాదంట.. ఓ కమర్షియల్ యాడ్. దీని కోసం ఎంతగానో వెయింటింగ్ అని ఈ కన్నడ బ్యూటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మరి.. ఈ నేషనల్ క్రష్ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంల తెలియజేయండి.