రష్మిక మందన్న.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి నేషనల్ క్రష్ అయిపోయింది. క్రష్మిక మందన్న అని ముద్దుగా పిలుచుకునే స్థాయికి ఎదిగిపోయింది. ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక.. గీతా గోవిందం సినిమాతో ఒక్కసారిగా అందరి అటెన్షన్ ని తనవైపు తిప్పుకుంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. గ్లామర్ క్వీన్ గానే కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ మెప్పించింది. పుష్ప సినిమాలో డీగ్లామర్ రోల్ లో నటించిన రష్మిక.. సీతారామం సినిమాలో అఫ్రీన్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో రష్మిక పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
తెలుగు, కన్నడ భాషల్లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది ఈ నేషనల్ క్రష్. రీసెంట్ గా వారిసు సినిమాతో కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాలో రంజితమే పాటతో ఒక ఊపు ఊపేసింది. కళ్ళు చెదిరే స్టెప్పులతో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఇక బాలీవుడ్ లో గుడ్ బై, మిషన్ మజ్ను వంటి సినిమాల్లో నటించి అక్కడ కూడా జెండా పాతేసింది. ప్రస్తుతం పుష్ప 2, ఎనిమల్ సినిమాల్లో నటిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. ఫ్యాన్స్ ని యాక్టివ్ గా ఉంచే రష్మిక.. తాజాగా ఫిట్నెస్ కి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేసింది.
హీరోయిన్ అన్నాక ఫిట్నెస్ ని మెయింటెయిన్ చేయక తప్పదు. ఈ విషయంలో రష్మిక.. అజంతా శిల్పంలా స్లిమ్ గా ఉండేందుకు జిమ్ లో వర్కవుట్లు చేస్తుంటుంది. తాజాగా ఫిట్నెస్ వీడియో షేర్ చేస్తూ.. స్ఫూర్తి కలిగించే పదాలు రాసుకొచ్చింది. బరువైన జిమ్ పరికరాలను మోయడమే కాదు.. బరువైన పదాలను సైతం రాయగలను అని నిరూపించింది. ఒకానొక సమయంలో బలంగా ఉన్న మహిళలను చూసినప్పుడు.. నేను ఇలా అవ్వగలనా అని అనుకునేదట, వారిలా అవ్వాలని అనుకునేదట. ఈరోజు తన వర్కవుట్ వీడియోలు చూసుకుంటే ఇలా ఉన్నాను. తాను ఇలా కనిపించడం కోసం ఎంతగానో ప్రయత్నించిందట.
మీరు ఇలా ఉండాలనుకోవడం గానీ ఇలా చేయాలనుకోవడం గానీ, ఏదైనా సాధించాలనుకోవడం గానీ, ఏం చేయాలన్నా గానీ.. ఏకాగ్రతతో ఆ పని చేస్తే క్రేజీగా ఉంటుందని మోటివేషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో పాటు అతి కష్టం మీద పుషప్స్ తీస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడాలని వర్కవుట్ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు రష్మిక హార్డ్ వర్క్ ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి రష్మిక ఇచ్చిన ఇన్స్పైరింగ్ కోట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.