రష్మిక, క్రష్మిక, నేషనల్ క్రష్ ఇలా పేరు ఏదైనా.. ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇటు సౌత్‌లోనే కాదు.. అటు బాలీవుడ్‌నీ రష్మిక షేక్ చేస్తోంది. పుష్ప సినిమాతో శ్రీవల్లిగా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఆ తర్వాత వారికి మరింత దగ్గరైపోయింది. బాలీవుడ్ ఆఫర్లు కూడా రష్మిక తలుపు తట్టడం మొదలైంది. ఒకటి కాదు, రెండు కదు మొత్తం రష్మిక నుంచి హిందీలో 3 ప్రాజెక్టులు రాబోతున్నాయి. డెబ్యూ సినిమాలోనే ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి లీడ్ రోల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. గుడ్‌బై అనే ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ ఒక్కటే కాకుండా మిషన్ మజ్నూ, యానిమల్ అనే సినిమాల్లోనూ హిందీ ప్రేక్షకులను రష్మిక అలరించనుంది. షూట్స్, ప్రమోషన్స్ ఇలా ముంబైలోనే రష్మిక ఫుల్ బిజీగా గడుపుతోంది.
నేషనల్ క్రష్‌కి ఉత్తరాన ఎంత క్రేజ్ ఉందో చెప్పే ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఈ సంఘటన ద్వారా రష్మిక మందాన ఎంత స్వీటెస్ట్ పర్సన్ అనేది కూడా ప్రేక్షకులకు, అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది. రష్మికను ఒక యువ అభిమాని వెంబడిస్తూ ఉన్నాడు. మేడమ్ సెల్ఫీ, మేడమ్ ఆటోగ్రాఫ్ అంటూ వేడుకుంటున్నాడు. ఆ అభిమానిని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని భావించిన రష్మిక మందాన అతనికి ఒక సెల్ఫీ ఇచ్చి తర్వాత అతను తెచ్చుకున్న పుస్తకంపై సంతకం చేసింది. అయితే ఆ యువ అభిమాని అక్కడితో సంతృప్తి చెందకుండా మరో కోరిక కోరాడు. అతను ఎంతో క్యూట్‌గా బతిమాలడంతో రష్మిక సైతం అతనికి నో చెప్పలేకపోయింది.
అతను బుక్‌పై సంతకం చేసిన తర్వాత షర్ట్ లోపల ఉన్న నెక్ టీషర్ట్‌పై కూడా సంతకం చేయాలని కోరాడు. అందుకు రష్మిక మొదట సంశయించింది. కానీ, అతను చాలా క్యూట్‌గా ప్లీజ్ ప్లీజ్ అని అడగడంతో క్రష్మిక పాపం కాదనలేక అతని గుండెలపై చిలిపి సంతకం చేసింది. అందుకు అతను ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. సంతకం చేసే సమయంలో రష్మిక సైతం సిగ్గుతో మొగ్గలేసింది. ఒక టాప్ హీరోయిన్‌కి ఫ్యాన్స్ నుంచి ఇలాంటి ప్రతిపాదనలు రావడం సహజమే. అందుకు కొందరు హీరోయిన్లు సున్నితంగా నో చెబుతూ ఉంటారు. కానీ, రష్మిక మాత్రం ఆ యువ అభిమానిని బాధ పెట్టడం ఇష్టంలేక సంతకం చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారంతా.. రష్మిక చాలా స్వీట్, ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఫ్యాన్స్ అంటే రష్మికకు ఎంతో అభిమానం అంటూ కామెంట్లు చేస్తున్నారు.