ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన డేటింగ్ వార్త ఏదైనా ఉంది అంటే అంది విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నలదే. ఈ వార్తపై తాజాగా స్పందించింది రష్మిక. ఓ ట్వీట్ ద్వారా తమ డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ వార్తలకు కొదవుండదు. ఒక హీరోయిన్, హీరో వరుసగా కొన్ని సినిమాల్లో కలిసి నటిస్తే.. అందులోని వారి కెమిస్ట్రీని చూసి వారు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు షికారు చేస్తూనే ఉంటాయి. ఇక ఈ వార్తలకు తగ్గట్లుగా వారు ఏ వెకేషన్ లోనైనా కలిసి కెమెరా కంటికి చిక్కారో అంతే సంగతులు. వారి డేటింగ్ ను కన్ఫమ్ చేస్తూ.. బోలెడన్ని వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయి. ఇలా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన డేటింగ్ వార్త ఏదైనా ఉంది అంటే అంది విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నలదే.
మాల్దీవుల్లో ఈ జంట కనిపించినట్లుగా పలు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అదీకాక రష్మిక సోషల్ మీడియలో ఇచ్చిన ఓ లైవ్ వీడియోలో వెనుక బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ వాయిస్ వినిపించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా సౌత్ డిజిటల్ మీడియా అనే ట్విట్టర్ ఖాతాదారుడు రష్మిక, విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉందంటూ అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దాంతో ఈ వార్తపై స్పందించింది రష్మిక. ఓ ట్వీట్ ద్వారా తమ డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జంట. అందుకు కారణం మాల్దీవుల్లో ఈ జంట కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేసింది అంటూ కొన్ని ఫోటోలు బయటికి రావడమే. అదీకాక రష్మిక లైవ్ వీడియోలో విజయ్ వాయిస్ వినిపించినట్లు ఓ వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇవన్నీ ఒకలెక్క అయితే.. ఓ మీడియా సంస్థ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో సదరు ఖాతాదారుడు ఈ విధంగా రాసుకొచ్చాడు. “విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నాలు డేటింగ్ లో ఉన్నారు అనడానికి స్ట్రాంగ్ రీజన్ విజయ్ చేతికి ఉండాల్సిన ఉంగరం రష్మిక చేతికి ఉండటం, అదీకాక ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. త్వరలోనే వీరు మనకి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు” అంటూ ఆ మీడియ సంస్థ రాసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ కావడంతో.. రష్మిక మందన్న స్పందించింది. గతంలో ఎన్ని సార్లు ఇలాంటి వార్తలు వచ్చినా గానీ స్పందించని రష్మిక.. దీనికి ట్వీట్ ద్వారా రిప్లై ఇచ్చింది. ఆ ట్వీట్ కు రష్మిక బదులిస్తూ.. “అయ్యో మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాబు.. డోంట్ ఓవర్ థింక్” అంటూ డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప2తో పాటుగా మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. ఇటు విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి విజయ్ తో డేటింగ్ వార్త పై రష్మిక ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Aiyoooo.. don’t over think it babu.. 🤣❤️
— Rashmika Mandanna (@iamRashmika) April 6, 2023