ఇండస్ట్రీలోకి ఆరేళ్లు మాత్రమే అయింది. అయితేనేం పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. ఏకంగా 18 సినిమాలు చేసేసింది. ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఆమె ఎక్కడుంటే అక్కడ వైరల్ వార్తలు గ్యారంటీ. కాలేజీ చదువుతున్న టైంలోనే హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఓ స్టార్ హీరోతోనూ ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తున్నట్లు ఎప్పటినుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అది నిజమే అన్నట్లు చాలాచోట్ల చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సడన్ గా తన డ్రస్ తో న్యూస్ లో హాట్ టాపిక్ అయిపోయింది. పైన ఫొటోలో కనిపిస్తున్నది ఆమెని మరి గుర్తుపట్టారా?
ఇక విషయానికొస్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి నేషనల్ క్రష్ గా ఫేమ్ సంపాదించిన రష్మిక. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ భామ, రిషభ్ శెట్టి డైరెక్ట్ చేసిన ‘కిరాక్ పార్టీ’తో హీరోయిన్ గా మారి తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. అలా సొంత భాష కన్నడలో మరో రెండు చిత్రాలు చేసిన ఈమె.. ‘ఛలో’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా హిట్ తో మొదలైన ఆమె కెరీర్, ‘పుష్ప’ వరకు సక్సెస్ ఫుల్ రన్ అయింది. ఇప్పటివరకు మహేశ్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
తెలుగు, కన్నడ, తమిళంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన రష్మిక.. అమితాబ్ ‘గుడ్ బై’తో హిందీలోకి పరిచయమైంది. రీసెంట్ గా ‘మిషన్ మజ్ను’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించింది. ఇక ఆమె కెరీర్ గురించి వదిలేస్తే.. రౌడీహీరో విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్ లో ఉందని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రష్మిక మాత్రం తాము ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతూ వస్తోంది. మరోవైపు బాలీవుడ్ నీరు బాగానే ఒంటబట్టినట్లు ఉంది. ఈ క్రమంలోనే తాజాగా చిట్టిపొట్టి గౌనులు వేసుకుని కనిపిస్తుంది. అలా సోషల్ మీడియాలో తన గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఇలా ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే రష్మిక చిన్నప్పటి ఫొటో ఇప్పుడు అనుకోకుండా వైరల్ కావడంతో అందరూ ఆమెని గుర్తుపట్టడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. మరి ఈమె చిన్నప్పటి ఫొటో చూడగానే మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.