క్షమించాలని కోరుతున్న యాంకర్ రష్మీ.. కారణం అదే!

తన యాంకరింగ్ తో బుల్లితెరపై దుమ్మురేపిన యాంకర్ రష్మీ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలల్లో అలరిస్తూ దూసుకెల్తుంది. టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన రష్మీ తన నటనతో, అందంతో యువతను ఆకట్టుకుంటోంది.

ప్రముఖ ఈటీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంది. గతంలో జబర్దస్త్ షోను అనసూయ యాంకర్ గా చేయగా… ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కి రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో బిజీ కావడంతో పాటు వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి రెండు షోలకు రష్మీనే యాంకర్‌గా చేస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెని కార్యక్రమానికి కూడా యాంకర్ గా అలరిస్తుంది..

అలా ప్రతి ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తుంది. అయితే ఈ షో కి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే ఈ ఫ్రోగ్రామ్ కి మెుదట్లో సీరియల్ యాక్టర్ అంబటి అర్జున్ వ్యాఖ్యతగా చేసాడు. కానీ అతను అందరికి ప్రేక్షకులో అంతగా రాణించలేదు. అప్పుడు రంగంలోకి సుడిగాలీ సుధీర్ వచ్చాడు. అప్పటి నుంచి ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. అలా కొన్ని రోజులు బాగానే నడుస్తూ వచ్చింది. అంతలోనే సుదీర్ కొన్ని కారణాల వలన ఈ షో ని వదిలేయడం జరిగింది. ఆ స్థానంలో యాంకర్ రష్మీ వచ్చి ఇంకా ఎక్కువ ప్రజలను ప్రేక్షకులను ఆకర్షించే విధంగా చేసింది.

అలా యాంకర్ రష్మీ ఈ షో కి అడుగుపెట్టి ఒక సంవత్సరం కావడంతో సోషల్ మీడియా వేదికలో అభిమానులు వివిధ రకాలైన వీడియోలు ఎడిటింగ్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ క్రమంలోనే రష్మీ సైతం ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెని కార్యక్రమానకి యాంకర్ గా వచ్చి ఆమె ఏడాది పూర్తి కావడంతో ఆమె సోషల్ మీడియా వేదికని స్పందిచింది. ఇలా ప్రతి సండే నాకు ఎంతో స్పెషల్ అని చెప్పుకొచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు ఆదివారం రోజున ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ షో అందరికి చాలా బాగా నచ్చిందని తెలిసి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాగే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా మాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగిన మమ్మల్ని క్షమించాలని రష్మీ ఈ సందర్భంగా అభిమానులను కోరుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed