Rashmi Gautam: తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో పాపురల్ అయిన యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు. గతంలో వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా రష్మి కి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ.. జబర్ధస్త్ లోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ అమ్మడి జాతకమే మారిపోయింది. బుల్లితెరపై మంచి సక్సెస్ వచ్చిన తర్వాత వెండి తెరపై కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. కాకపోతే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. రష్మీ జబర్ధస్త్ లోనే కాకుండా ఇతర టీవీ షోస్ లో బిజీగా ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా కనిపించే రష్మీ గౌతమ్ నిజ జీవితంలో అంతులేని విషాదం ఒకటి ఉంది. దాన్ని తలుచుకుని తాజాగా, ఆమె స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ స్టేజి మీద ఆ లోటును తలుచుకుని రష్మీ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే… ఫాదర్స్ డే (ఆదివారం, జూన్ 19) సందర్భంగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ‘నాన్న నా హీరో’ అని ఒక స్పెషల్ ఎపిసోడ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తండ్రితో తమ అనుబంధం గురించి చెప్పారు. ఈ ప్రోగ్రామ్ కి ‘బుల్లెట్’ భాస్కర్, నూకరాజు, గీతూ రాయల్, ‘జోర్దార్’ సుజాత, సింగర్ మధు ప్రియ ఇలా చాలా మంది నటీనటుల ఫాదర్స్ వచ్చారు. జబర్ధస్త్ నటి పవిత్ర మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల మా నాన్న బాగా డ్రింక్ చేసేవారు. ఆ సమయంలో నేను ఆయన్ని అసహ్యించుకునేదాన్ని.. ఎప్పుడూ మాట్లాడలేదు, ఆయన్ను ముట్టుకోలేదు. ఆయన మరణించిన తర్వాత కాళ్ళకు మొక్కి మాట్లాడాను అంటూ కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఆ సమయంలో అక్కడ ఉన్నవారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక రష్మీ గౌతమ్ మాట్లాడుతూ.. బ్యాడ్ పేరెంట్స్, గుడ్ పేరెంట్స్ ఉంటారా? లేదా? అనేది నాకు తెలియదు. నా ఫాదర్ దగ్గర నుంచి నేను మాత్రం ఎప్పుడూ ఇటువంటి ఆప్యాయత చూడలేదు, అందరికీ ఫాదర్స్ డే విషెస్ అంటూ స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్నారు. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లడం వలన తల్లి పెంచినట్టు గతంలో ఒకసారి చెప్పుకొచ్చారు. ఎప్పుడూ సందడిగా అందరినీ నవ్వించే నటులు.. ఒక్కసారే ఏడిపించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Karan Johar: వాళ్లకు కరోనా వస్తే.. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? : కరణ్ జోహార్