టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రష్మీ గౌతమ్.. తన పెళ్లి గురించి మొదటిసారిగా పెదవి విప్పనుంది. 9 ఏళ్ళ నుంచి నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను, పెళ్లి కుదిరింది అంటూ చెప్పుకొచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి ‘అక్కా బావెక్కడ’ స్కిట్ లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో “తొమ్మిదేళ్ల నుంచి మీరు అడుగుతున్న క్వశ్చన్ కి ఈరోజు, ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను. పెళ్ళి కుదిరింది” అంటూ రష్మీ సిగ్గుపడుతోంది. ఆ తర్వాత లేడీస్ బ్యాచిలర్ పార్టీకి ఫ్రెండ్స్ ని ఆహ్వానిస్తుంది. ఈ పార్టీలో హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ లు కూడా వెళ్తారు. అయితే రష్మీ పెళ్లి ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఫన్ జనరేట్ చేస్తుంది. ఇక ప్రేమనగర్ సినిమాలోని “ఎవరి కోసం” పాటకు మందు బాటిల్ పట్టుకుని డ్యాన్స్ వేసింది. ఆ తర్వాత “రష్మీ బయోగ్రఫీ”ని ఈ ప్రోమోలో చూపించడం బాగా హైలైట్ అయ్యింది.
చిన్నప్పుడు రష్మీ తండ్రి ఆమె తల్లికి విడాకులు ఇస్తాననడం, ఆమె తల్లి రష్మీ నాతోనే ఉంటుంది అని అనడం రష్మీకి కళ్ళంట నీళ్లు తెప్పించాయి. ఆమె తన తండ్రి ప్రేమను ఎంత మిస్ అయ్యిందో అనేది ఆమె కన్నీళ్ళని చూస్తే తెలుస్తుంది. కొన్నేళ్ల తర్వాత మొదటి సినిమా అవకాశం రావడం, ఆమె తల్లి సపోర్ట్ చేయడంతో రష్మీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం చూపించారు. “అయ్యో షో చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు గేటు తెరుస్తారో లేదో తెలియదు. ఎవరైనా ఉన్నారా? ఒక్కదాన్నే ఉన్నాను. చుట్టూ చీకటిగా ఉంది. ప్లీజ్ గేటు తీయండి” అంటూ రష్మీ కేరెక్టర్ చేసిన భానుశ్రీ కింద కూలబడిపోతుంది. అది చూసి రష్మీ ఏడ్చేస్తుంది. ఇక ఆది మాట్లాడుతూ.. “తనకు తెలుగు మాట్లాడటం రాదు అన్న స్థాయి నుంచి తెలుగు వాళ్లందరూ తన గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది” అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ మాటకు రష్మీ హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ప్రోమో ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ కానుంది. అయితే ఆమె జీవితం మొత్తాన్ని చూపించనున్న ఈ ఎపిసోడ్ లో ఆమె నిజంగానే తన పెళ్ళి గురించి క్లారిటీ ఇస్తారా? లేక ఎప్పటిలానే కామెడీ కోసం చేశారని అనిపిస్తారా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Dhee Show: ఢీ షోలో షాకింగ్ సీన్.. ప్రదీప్, హైపర్ ఆదిలకు వార్నింగ్! సెన్స్ లేదా అంటూ!
ఇది కూడా చదవండి: Brain Aneurysms: స్టార్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ‘2 సార్లు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను’!