అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప సూపర్ డూపర్ హిట్‌ను అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో కలెక‌్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ఈ సినిమాలోని అల్లు అర్జున్ మ్యానరిజం, పాటలు, డైలాగులు, స్టెప్పులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సామన్య ప్రజలు పుష్ప ఫీవర్‌తో ఊగిపోతుంటే.. టీమిండియా క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా పుష్ప ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు జడేజా, రైనా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్‌తో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్ప పాటలకు స్టెప్పులు వేసి, డైలాగులు చెప్పి అదరగొట్టారు.
తాజాగా ప్రపంచ మేటి స్పిన్నర్, ఆఫ్గానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా పుష్పలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు. అల్లు అర్జున్ చేసిన చెప్పు స్టెప్పును చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రసీద్ ఖాన్‌తో పాటు పాక్ ఆటగాడు హరీస్ రవూఫ్ ఈ వీడియోలో ఉన్నాడు. మరి ఈ రషీద్ ఖాన్ పుష్ప స్టెప్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.