Ranveer Singh: పాపులర్ బ్రిటీష్ అడ్వెంచర్, టీవీ ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ టీవీ ప్రేక్షకులకు సుపరిచితమే. డిస్కవరీ ఛానల్ లో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ హోస్ట్ గా బేర్ గ్రిల్స్ చేసే సాహసాలు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దట్టమైన అటవీ ప్రాంతాలలో, కొండలు గుట్టలు, లోయలు, పర్వతాలు, సముద్రాలు, నదీ తీరాలు.. ఇలా అన్నింటా ప్రయాణిస్తూ.. ప్రమాదాలలో చిక్కుకున్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో గ్రిల్స్ చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడిచే ఫీలింగ్ కలిగిస్తుంటాయి.
ఇండియాలో ఇప్పటికే బేర్ గ్రిల్స్ తో కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రధాని నరేంద్రమోదీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చేసిన సాహసాలను ఎంతగానో ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. బేర్ గ్రిల్స్ చేసే ప్రతీ ఎపిసోడ్ చూసేవాళ్లకు థ్రిల్ తో పాటు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. అయితే.. తాజాగా ఇండియన్ స్టార్ హీరో బేర్ గ్రిల్స్ తో సాహసాలు చేసేందుకు రెడీ అయిపోయాడు.
ఆ హీరో ఎవరో కాదు.. రన్వీర్ సింగ్. ప్రస్తుతం రన్వీర్ తో బేర్ చేసిన సాహసాలు, వాటికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అయితే.. ఈ ఎపిసోడ్ నెట్ ఫ్లిక్స్ లో జూలై 8 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ ఎపిసోడ్ కి రన్వీర్ వర్సెస్ వైల్డ్ అని టైటిల్ పెట్టడం మనం చూడవచ్చు. అలాగే బేర్ తో కలిసి రన్వీర్ చేసిన కామెడీ, స్టంట్స్, అడ్వెంచర్స్ ఖచ్చితంగా థ్రిల్ ఇచ్చేలా ఉన్నాయి.
ఇక మధ్య మధ్యలో రన్వీర్ తన భార్య దీపికా పదుకోనె గురించి చెబుతూ.. తనకోసం ఏవో ప్రేమ కవిత్వాలు చెబుతున్న షాట్స్ మనం గమనించవచ్చు. అలాగే.. దీపికా కోసం ఎప్పటికీ వాడిపోని పూలను తీసుకొస్తున్నానని చెప్పాడు. మరి రన్వీర్ సాహసాలు, యాక్షన్ ఏ స్థాయిలో చేసాడనేది చూడాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే. మరి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న బేర్ గ్రిల్స్, రన్వీర్ ల సాహసాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.