ఆ మధ్య రణ్ వీర్ సింగ్ నగ్న ఫోటో షూట్ ఒకటి చేసి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 1972లో కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసిన 1970ల నాటి పాపులర్ అమెరికన్ యాక్టర్ ‘బర్ట్ రెనాల్డ్’కి అంకితమిస్తూ రణ్ వీర్ సింగ్ ఈ నగ్న ఫోటోషూట్ చేశారు. అయితే ఈ ఫోటోషూట్ పై సోషల్ మీడియాలో వ్యతిరేకత వచ్చింది. రణ్ వీర్ సింగ్ కి మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు నిలిచినప్పటికీ.. ఆయన మీద వచ్చిన వ్యతిరేకత ముందు వారి మద్దతు నిలబడలేకపోయింది. దీంతో ఆయన మీద ఐపీసీ సెక్షన్ 292, 293, 509 కింద పలు కేసులు నమోదయ్యాయి. జూలై నెలలో ఎన్జీవో అధికారి ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద చెంబూరు పోలీస్ స్టేషన్ లో రణ్ వీర్ సింగ్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు.
ముంబై: న్యూడ్ ఫొటోషూట్‌పై పోలీసుల విచారణకు రణ్‌వీర్‌సింగ్.. తన ఫొటోను ఎవరో మార్ఫింగ్ చేశారు.. నగ్నంగా ఫొటో షూట్ చేయలేదన్న రణ్‌వీర్‌సింగ్#RanveerSingh #Mumbai
— NTV Breaking News (@NTVJustIn) September 15, 2022
భారతీయ స్త్రీలను అవమానించేలా ఫోటో షూట్ ఉందని, స్త్రీల సెంటిమెంట్లను హర్ట్ చేసేలా ఫోటోలు ఉన్నాయని ఎన్జీవో అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని రణ్ వీర్ సింగ్ కు ముంబై పోలీసులు నోటీసులు పంపించారు. ఆగస్టు 29న పోలీసుల ఎదుట హాజరైన రణ్ వీర్ ను సుమారు రెండు గంటల పాటు విచారించారు. అయితే తన ఫోటోలను మార్ఫింగ్ చేశారని ఆయన పోలీసుల వద్ద వెల్లడించారు. తాను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన 7 ఫోటోల్లో ఒక ఫోటో మార్ఫింగ్ కి గురయ్యిందని ఆయన పోలీసులకు తెలిపారు.
తాను ఇన్నర్ వేర్ లో తీయించుకున్న ఫోటోలు షేర్ చేశానని, అయితే వాటిని ఎవరో మార్ఫింగ్ చేసి నగ్న ఫోటోలుగా ప్రచారం చేశారని అన్నారు. మరి ఈయన నగ్న ఫోటో షూట్ లను పలువురు సెలబ్రిటీలు ఎందుకు మద్దతు ప్రకటించినట్టు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అది మార్ఫింగ్ అని తెలియకుండానే ఆ సెలబ్రిటీలు రణ్ వీర్ కి మద్దతు ప్రకటించారా? లేక రణ్ వీర్ సింగే అబద్ధం చెప్తున్నారా? అనేది సోషల్ మీడియా నెటిజన్లకు ఉన్న డౌటానుమానం? మరి రణ్ వీర్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
‘One Was Morphed’: Actor Ranveer Singh To Cops In Nude Photoshoot Case https://t.co/VZaJtDBPyA
NDTV’s Divya Wadhwa reports pic.twitter.com/8ixImTzNm9
— NDTV (@ndtv) September 15, 2022