ప్రొఫెషన్ ఏదైనా, ఇండస్ట్రీ ఏదైనా, ఉద్యోగం ఏదైనా లైంగిక వేధింపులు అనేవి ఉంటూనే ఉంటాయని చెబుతుంటారు. ఎంతో మంది తాము లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ఆరోపణలు చేయడం చూశాం. అయితే మిగిలిన ఇండస్ట్రీలను పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. కాస్టింగ్ కౌచ్ పేరిట పాన్ ఇండియా లెవల్లో సినిమా వాళ్లపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. డైరెక్టర్లు, నిర్మాతలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. మోడళ్లు, హీరోయిన్లు కొందరు ఇలాంటి ఆరోపణలు చేయడం కలకలం రేపాయి. మీటూ అంటూ ఓ ఉద్యమం కూడా నడిచింది. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అతను మరెవరో కాదు.. బీ టౌన్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్న రణ్‌వీర్ సింగ్ ఈ ఆరోపణలు చేశాడు. అయితే ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు అకస్మాత్తుగా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడో క్లారిటీ లేదు. ఇటీవల రణ్‌వీర్ సింగ్ మర్రకేచ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు. అక్కడ మాట్లాడుతూ.. “నా కెరీర్ స్టార్టింగ్‌లో ఓ వ్యక్తి నన్ను కలిశాడు. నువ్వు బాగా కష్టపడతావా? లేక తెలివిగా కష్టపడతావా? చూసేందుకు హార్ట్ వర్కర్‌లాగానే కనిపిస్తున్నావు. అలా అతను నాతో మాట్లాడే సమయంలో సెక్సీ, డార్లింగ్, బి స్మార్ట్ వంటి పదాలను ఉపయోగించాడు. నా కేరీర్ ప్రారంభమైన మూడున్నరేళ్లలో అలాంటి చేదు అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. వాటిని ఎదిరించి నిలబడ్డాను కాబట్టే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను” అంటూ రణ్‌వీస్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఇన్నాళ్లు లేకుండా ఒక్కసారిగా రణ్‌వీర్ సింగ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంక సినిమాల విషయానికి వస్తే.. రణ్‌వీర్ సింగ్ ఎంతో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఉంటాడు. బయట కూడా రణ్‌వీర్ ఎంతో ప్రత్యేకంగా ఉంటాడు. అతని వేషం, భాష అన్నీ భిన్నంగా ఉంటాయి. రొటీన్‌కి భిన్నంగా ఉండటమే రణ్‌వీర్‌కి బాగా కలిసొచ్చింది అని కూడా చెప్పొచ్చు. ఇంక త్వరలోనే రణ్‌వీర్ సింగ్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయబోతున్నాడు అంటూ బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2, ఆర్సీ15 సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత రణ్‌వీర్‌తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
Ranveer Singh shares his casting couch experience
More here: https://t.co/L6ctDGiYBb#RanveerSingh pic.twitter.com/cJrAW95ivv
— editorji (@editorji) November 16, 2022