ఇచ్చిన మాట ప్రకారం.. సరబ్‌జిత్‌ సింగ్‌ అక్క పాడె మోసిన హీరో దీపక్‌ హుడా!

  • Written By:
  • Updated On - September 9, 2022 / 12:30 PM IST

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ అభిమానుల కోసం దైనికైనా సిద్దమవుతున్నారు. వారు కష్టాల్లో ఉంటే దగ్గరుండి మరీ సహాయాన్ని అందిస్తున్నారు. మరణానికి చేరువైన అభిమానుల కోసం స్వయంగా వెళ్లి వారిని కలిసి సంతోష పెడుతున్నారు. తాజగా బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా.. సరబ్‌జిత్‌ సింగ్‌ సోదరి దల్బీర్ కౌర్‌ పాడెను మోసి ఆమెకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటిస్తూ.. పెద్దగా స్టార్ హోదాతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రణ్ దీప్ హుడా. ఆయన కేవలం నటుడిగానే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో మంది అభిమానం చూరగొన్నాడు. ఆ మద్య వచ్చిన ‘సరబ్ జిత్’బయోపిక్ మూవీలో సరబ్‌జిత్‌ సింగ్‌ పాత్రలో రణ్‌దీప్ హుడా నటించాడు. ఆ సమయంలో సరబ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్‌ కౌర్‌ తో పరిచయం ఏర్పడింది.

ఆమెను తన సొంత సోదరిగా భావించడంతో వారి మద్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ సమయంలో నటుడు రణ్ దీప్ ని ఓ కోరిక కోరింది దల్బీర్ కౌర్. తాను చనిపోయిన తర్వాత ‘కంధా’ అంటే తన పాడె మోయాల్సిందిగా దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా కోరింది. అమె కోరిక ప్రకారం మాట ఇచ్చాడు రణ్ దీప్ హుడా.

ఆమెను తన సొంత సోదరిగా భావించడంతో వారి మద్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ సమయంలో నటుడు రణ్ దీప్ ని ఓ కోరిక కోరింది దల్బీర్ కౌర్. తాను చనిపోయిన తర్వాత ‘కంధా’ అంటే తన పాడె మోయాల్సిందిగా దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా కోరింది. అమె కోరిక ప్రకారం మాట ఇచ్చాడు రణ్ దీప్ హుడా. దల్బీర్‌ కౌర్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో ఉన్న భిఖివింద్‌లో ఆదివారం గుండెపోటుతో మరణించింది. గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం పాడేను మోసి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV