ప్రపంచంలో సినీ ప్రముఖులు ఏది చేసిన అది సోషల్ మీడియాలో వార్తయిపోతుంది. అది ఏవరు పెట్టితే ఏమి వీరికి కావల్సి ప్రచారం మాత్రం అయిపోతుంది. సాధారణంగా హీరోయిన్స్ ఫోటోలు, వీడియోస్ ఎక్కువ వైరల్ అవుతుంటాయి. కానీ తాజాగా బాలీవుడ్ హీరో రణ్ బీర్ చేసిన ఓ సరదా పని ఇప్పుడు నెటింట్లో తెగ వైరల్ అవుతుంది.
బాలీవుడ్‌లో క్రేజీ లవ్ బర్డ్స్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్. త్వరలో ఏడడుగులు నడవబోతోన్నారని సమాచారం.అయితే జంటగా కనిపించే వీరి ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి.కాగా వీరిద్దరు జంటగా కలిసి నటిస్తోన్న చిత్రం ‘బ్రహ్మాస్ర్త’. ఈ సినిమాలలో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రం విడుదలై విజయం సాధించాలని రణ్ బీర్, అలియా ఉత్తర బాంబేలోని సర్బోజనిన్ దుర్గా పూజ సమితిలోని కాళి మాత దర్శనానికి వెళ్లారు.దుర్గ పూజలో భాగంగా వీరిద్దరు మ్యాచింగ్ దుస్తులు ధరించి సందడి చేశారు.
అయితే ఓ వీడియోలో మాత్రం ఆలియా లెహెంగా చున్నీని రణ్ బీర్ కాలితో ముందుకు తన్నడం కనిపించింది.ఇందులో మొదట రణ్‌బీర్, ఆలియా స్టేజ్ పైనుంచి కిందకి దిగుతారు. ఆ సమయంలో అలియా లెహంగా చున్నీ కిందపడుతుంది. ఆమె వెనుకనే ఉన్న రణ్ బీర్ దాన్ని చూసి కాలితో తన్నేశాడు.ఆ వీడియో చూసిన నెటిజన్లు.. రణ్‌బీర్‌కు పొగరెక్కువని, ఎంతో అమర్యాదగా ప్రవర్తించాడని నెటిజన్లు విమర్శల కామెంట్స్ చేశారు. ‘ఆలియాపై అతనికి ప్రేమ లేదు. అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. తన గురించి తప్ప మరొకరి గురించి ఆలోచించడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి