బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ల ప్రస్తావన భారీ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బీటౌన్ లో రణబీర్, అలియాల పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లి వార్త కోసం ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకునే అక్కర్లేదు. అయితే.. వీరి పెళ్లి 2020లోనే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా అలియా భట్ – రణబీర్ లు పెళ్లికి తేది ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకూలిస్తే వారు ఈ ఏప్రిల్ నెలలోనే రెండు లేదా మూడో వారంలో పెళ్లి చేసుకోనున్నారట. పక్కాగా చెప్పాలంటే ఏప్రిల్ 17న వారి పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయినట్లు సన్నిహిత వర్గాల వారు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్.. రణబీర్ – అలియా లపై ఓ ఫన్నీ వీడియో రిలీజ్ చేసింది.
హమ్ థీ శర్మకి దుల్హనియాలో అలియా సీన్ కి, యే జవానీ హై దివాని మూవీలోని రణబీర్ సీన్ మిక్స్ చేసి వీడియో ఇంస్టాగ్రామ్ లో వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో అలియా.. నేను ఎప్పటినుండి వెయిట్ చేస్తున్నాను నీకోసం.. అంటూ రణబీర్ తో డైలాగ్ చెబుతుంది. ప్రస్తుతం నెటిజన్లను ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.