బాలీవుడ్ ప్రేమజంట రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ల పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బీటౌన్ లో రణబీర్, అలియాల పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లి వార్త కోసం ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకునే అక్కర్లేదు. అయితే.. వీరి పెళ్లి 2020లోనే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా అలియా భట్ – రణబీర్ లు పెళ్లికి తేది ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకూలిస్తే వారు ఈ ఏప్రిల్ నెలలోనే రెండు లేదా మూడో వారంలో పెళ్లి చేసుకోనున్నారట. పక్కాగా చెప్పాలంటే ఏప్రిల్ 17న వారి పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయినట్లు సన్నిహిత వర్గాల వారు తెలిపినట్లు సమాచారం. అయితే ఇలా ఆకస్మికంగా పెళ్లి చేసుకునేందుకు అలియా భట్ వాళ్ళ తాత ఎన్. రజ్దాన్ కారణమట.
ఆయన అనారోగ్యం కారణంగా తాను చనిపోయేలోపు అలియా పెళ్లి చూడాలనుకుంటున్నారట. అందుకే ఏప్రిల్ 17న వివాహ ముహుర్తం ఖరారు చేశారని తెలుస్తుంది. కుటుంబ సమేతంగా ఆర్‌కే స్టూడియోస్ లో జరగనుందట. అలియా భట్ తాత రజ్దాన్ ఆరోగ్యస్థితిని బట్టి ఏప్రిల్ 17న లేదా ఏప్రిల్ రెండు, మూడో వారంలో వీరి పెళ్లి జరగనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.