భారీ బడ్జెట్, సినిమా ఇండస్ట్రీలోని సూపర్ స్టార్లతో బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’. వివిధ అస్త్రాల ప్రాముఖ్యత, విశిష్టతను తెలిజేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘శివ’.. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా బృందం ప్రమోషన్స్ మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే. బుధవారం చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ కు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. రణబీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ట్రైలర్ లో ప్రతి సీనూ, ప్రతి షాటు అద్భుతంగా ఉన్నాయి. అంతేకాదు హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు అని చెప్పవచ్చు. మరి.. బ్రహ్మాస్త్ర ట్రైలర్ చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.