బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. రణ్ బీర్ కపూర్, అతడి భార్య ఆలియా భట్ తొలిసారి జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీ సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంతగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ జంట నార్త్ నుంచి సౌత్ వరకు పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి వెళ్లారు. అక్కడ మహాకాళేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ గుడిలోకి వెళ్లారు. అక్కడ వీరిని కొందరు అడ్డుకున్నారు. బీఫ్ మాంసం తినే విషయంలో వీరిద్దరు గతంలో చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తలు రణ్ బీర్ దంపతులను అడ్డుకున్నట్లు సమాచారం.
గతంలో ఓ సారి ఆలియా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని ఆలియా చాలా ఏళ్ల కిందట చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం రణ్ బీర్ సింగ్ ..తాను మటన్, చికెన్ పాటు బీఫ్ కూడా తింటానని చెప్పాడు. దీంతో రణ్ బీర్, ఆలియా లపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో బ్రహ్మాస్త్ర ముూవీకి కూడా బాయ్ కాట్ సెగ అట్టుకున్న సంగతి తెలిసిందే. ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాతో పాటు బ్రహ్మాస్త్రను బాయ్ కాట్ చేయాలంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. మరి.. తాజాగా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The ‘Beef Guy’ Ranbir Kapoor, his arrogant wife Alia Bhatt & the confused ‘Brahmastra’ director, Ayan Mukherjee were booted out of Ujjain’s Mahakal temple by the protesting hindus there. The trio escaped b4 completing their temple run.👇#BoycottBramhashtra #CulturalGenocide pic.twitter.com/Wm1rhwenHd
— Ranita Ch (@ChRanita) September 6, 2022
Beef eater has no place in Mahakal. Period.#BoycottBrahmastra pic.twitter.com/e3Kmu07EJq
— Kashmiri Hindu (@BattaKashmiri) September 7, 2022