సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు సొంతింటి కల ఉంటుంది. ఇక సినిమా రంగంలోని వ్యక్తుల గురించి చెప్పనక్కర్లేదు. వారు నటించే సినిమాల దగ్గర నుండి ఇళ్లు, వ్యక్తిగత సమాచారం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు అభిమానులు.
సొంత ఇంటి కల ఎవ్వరికైనా ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. డబ్బును బట్టి ఇల్లును కొనుగోలు చేస్తుంటారు.. నిర్మించుకుంటారు. సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు ఆ కల ఉంటుంది. ఇక సినిమా రంగంలోని వ్యక్తుల గురించి చెప్పనక్కర్లేదు. వారు నటించే సినిమాల దగ్గర నుండి ఇళ్లు, వ్యక్తిగత సమాచారం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు అభిమానులు. సినీ పరిశ్రమలో ఇటీవల ఇళ్లు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య భారీగానే పెరిగింది. మొన్నటికి మొన్నసమంత భారీగా ఖర్చు పెట్టి హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలోకి మరో నటి చేరింది.
బాలీవుడ్ లవర్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రణబీర్ కపూర్ తల్లి, బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ముంబయిలో సెలబ్రిటీ ప్రాంతమైన కుర్లా కాంప్లెక్స్‌లో విశాలమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఫోర్ బీహెచ్‌కే ప్లాట్ ను కొన్నట్లు తెలుస్తోంది. దీని విలువ దాదాపు రూ.17.4 కోట్లు అని సమాచారం. ప్రస్తుతం పాలి హిల్‌లోని కృష్ణ రాజ్ బంగ్లాలో నివసిస్తున్న నీతు కపూర్ రీసేల్ డీల్‌లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. మే 10న రిజిస్టర్ చేసుకున్నారని సమాచారం. కేవలం రిజిస్ట్రేషన్‌కే దాదాపు రూ.1.04 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. 1966లో సూరజ్ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం.. ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. 70-80 దశకంలో బాలీవుడ్ బిజీ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. 1980లో రిషి కపూర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి రణబీర్ కపూర్, రిద్దిమా కపూర్ పిల్లలు.