తెలుగు సినీ ప్రపంచంలో దగ్గుబాటి కుటుంబానికి ఓ ప్రత్యేక ప్రస్థానం ఉంది. ఆ కుటుంబం నుంచి నిర్మాత సురేష్ బాబు వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రానా.. తనకంటూ ఓ ప్రత్యేక పంథా క్రియేట్ చేసుకున్నాడు. చాలా విషయాల్లో ఒపెన్‌గా ఉండే రానా.. తాజాగా తన ఆరోగ్యం గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించాడు.
రానా దగ్గుబాటి.. ప్రముఖ నిర్మాత రామా నాయుడు మనవడిగా, సురేష్ బాబు కొడుకుగా.. దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ ఖమ్ముల సినిమా లీడర్‌తో టాలీవుడ్‌లో ల్యాండ్ అయ్యాడు. ఆ తర్వాత విభిన్నమైన కథలు ఎంచుకుంటూ.. కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు రానా. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి.. భిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. కేవలం హీరోగా మాత్రమే రాణించాలని రానా కోరుకోలేదు. కథ, పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లే అవుతున్నా.. ఇప్పటికే అన్ని రకాల పాత్రలు పోషించాడు రానా. ఇక ‘బాహుబలి’ లాంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. బోల్డ్ కంటెంట్, బూతులు ఎక్కువగా ఉన్నాయి అనే విమర్శలు వచ్చినా.. సిరీస్ మాత్రం సూపర్ సక్సెస్ సాధించింది.
ఇక తాజాగా రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు రానా. తాను కన్ను, కిడ్నీ సమస్యలతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ‘‘గతంలో నాకు కుడి కన్ను, కిడ్నీలకు ఆపరేషన్ అయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి కుడి కన్ను కనిపించదు. అందుకే దానికి ఆపరేషన్ చేశారు. కొన్నాళ్ల క్రితం కిడ్నీలకు సంబంధించిన సమస్యలు రావడంతో చివరికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది’’ అని వెల్లడించాడు రానా.
అంతేకాక ‘‘చాలా మంది శారీరక సమస్యల కారణంగా మానసికంగా ఎంతో ఇబ్బంది పడతారు. కొన్నాళ్లకు ఆ సమస్య పరిష్కారమైనప్పటికి.. అందుకు సంబంధించిన బాధ కొంత మేర మిగిలి ఉంటుంది. అయితే ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ నేను ధైర్యంగా ఉన్నాను. అందుకే ఆ సమస్యల నుంచి బయటపడగలిగాను’’ అని చెప్పుకొచ్చాడు రానా. గతంలో సమంత హోస్ట్ గా చేసిన ‘సామ్ జామ్’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా రానా తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పాడు. జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు ఒక్కసారిగా పాజ్ బటన్ నొక్కితే ఎలా ఉంటుందో.. తన లైఫ్ లో కూడా అలాంటి పరిస్థితి వచ్చిందన్నాడు. తనకు చిన్పప్పటి నుంచీ బీపీ ఉందని, దీంతో గుండె సంబంధిత సమస్య కూడా వచ్చిందని సమంత షోలో వెల్లడించాడు రానా.
ఈ క్రమంలో కొంత వయసు వచ్చిన తర్వాత కిడ్నీలు కూడా పాడయ్యాయని తెలిపాడు రానా. డాక్టర్లు తనకు పరీక్షలు చేసి వీలైనంత త్వరగా వైద్యం చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారని చెప్పుకొచ్చాడు. అయితే మొదట్లో కొన్ని మందులతో ఆ సమస్య తగ్గుతుందేమో అనుకున్నారని, కానీ అలా జరగలేదన్నాడు. చివరకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు. వైద్యం చేయించుకుంటున్న సమయంలో తన కుటుంబాన్ని చూస్తే చాలా బాధగా అనిపించేదన్నాడు రానా. తాజాగా మరోసారి తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు.
రానా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనిలో విక్టరీ వెంకటేష్ కూడా ప్రధాన పాత్రలో కనిపించాడు. వెంకటేష్, రానా కలసి ఓ వెబ్ సిరీస్ లో నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సీరిస్‌పై కొన్ని నెగిటివ్ కామెంట్లు వస్తున్నప్పటికి.. ప్రస్తుతం రానా నాయుడు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రానా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.