వెంకీమామలో సరికొత్త యాంగిల్ ని బయటకు తీసిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. బూతులు, అశ్లీల సీన్లతో అంతటా రచ్చ లేపిన ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.
‘రానా నాయుడు’.. తెలుగు రాష్ట్రాల్లో ఈ వెబ్ సిరీస్ ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఫేవరెట్. అలాంటి వెంకీమామ.. సిరీస్ లో డైరెక్ట్ గా బూతులు, అశ్లీల సీన్స్ లో రెచ్చిపోయాడు. కొన్ని కొన్ని సైగలు అయితే మరీ దారుణంగా ఉండటంతో సోషల్ మీడియాలో కొన్నాళ్ల ముందు డిస్కషన్ అంతా ఈ సిరీస్ గురించే నడిచింది. తొలి సీజన్ లో కనిపించిన రచ్చ నుంచి ఇంకా కోలుకోకముందే రెండో సీజన్ పై ప్రకటన చేశారు. అధికారికంగా డీటైల్స్ కూడా వెల్లడించారు.
అసలు విషయానికొస్తే.. తెలుగులో వెబ్ సిరీసులు తీస్తున్నారు కానీ ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకుండా చూసుకుంటున్నారు. మిగతా భాషల్లో తీసి డబ్ చేస్తున్న సిరీసుల్లో మాత్రం డైరెక్ట్ గా బూతులు, అశ్లీల సన్నివేశాలు పెట్టేస్తున్నారు. అలా వచ్చిన సిరీస్ ‘రానా నాయుడు’. నార్మల్ గా అయితే దీని గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు. అందులో వెంకటేష్, రానా.. నాగ నాయుడు, రానా నాయడు అనే తండ్రి కొడుకుల పాత్రల్లో యాక్ట్ చేయడం వివాదానికి కారణమైంది.
ఈ సిరీస్ ని పూర్తిగా రానా, నాగ.. వాళ్ల ఫ్యామిలీలో గొడవలు, మనస్పర్థలు లాంటి ఎలిమెంట్స్ తో తీశారు. తాజాగా రిలీజ్ చేసిన రెండో సీజన్ అనౌన్స్ మెంట్ వీడియోలో.. ‘ఈసారి మరిన్ని ట్విస్టులు, షాక్స్ తో రానా నాయుడు అలరిస్తుంది’ అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తెలుగు ప్రేక్షకులకు ఈ సిరీస్ పెద్దగా నచ్చకపోయినప్పటికీ.. నార్త్ ఆడియెన్స్ మాత్రం తెగ చూసేశారు. గ్లోబల్ వైడ్ కూడా నెట్ ఫ్లిక్స్ లోనూ ట్రెండ్ అయింది. ఎక్కువమంది చూసిన నాన్ ఇంగ్లీష్ టీవీ సిరీస్ గా గుర్తింపు తెచ్చుకుంది. మన దేశంలో అయితే వరసగా మూడు వారాల పాటు ఎక్కువమంది చూసిన సిరీస్ గా నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. రెండో సీజన్ మరింత ఎంటర్ టైనింగ్ ఉండబోతుందని తెలుస్తోంది. మరి మీలో ఎంతమంది ‘రానా నాయుడు 2’ కోసం వెయిట్ చేస్తున్నారు. కింద కామెంట్ చేయండి.