హీరోగా, విలన్ గా.. అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దగ్గుబాటి రానా. తాత,తండ్రిలా నిర్మాణం వైపు పోకుండా నటుడిగా రాణిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే హీరో రానా కుటుంబంతో సహా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం దర్శించుకున్నాడు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ తర్వాత ఓ అభిమాని చేసిన పనికి రానా సీరియస్ అయ్యాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రానా, అతడి భార్య మిహీక సంప్రదాయ దుస్తుల్లో ఉండగా.. తండ్రి సురేశ్ బాబు, తమ్ముడు అభిరామ్ మాల ధరించి ఉన్నారు. మరోవైపు వీరిని చూడగానే పలువురు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే సెల్ఫీ తీసుకునేందుకు ఓ అభిమాని ప్రయత్నించగా.. రానా అతడి ఫోన్ లాక్కున్నాడు. కాసేపు తన దగ్గరే పెట్టి, గుడి దగ్గర సెల్ఫీలు వద్దని చెప్పి తిరిగిచ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ‘లీడర్’ మూవీతో రానా సినీ కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది పవన్ కల్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ అనే మల్టీస్టారర్ లో నటించాడు. ఈ మధ్య ‘విరాటపర్వం’లో ఆకట్టుకున్నాడు. ఇదంతా పక్కనబెడితే రానా, అభిమాని ఫోన్ లాక్కోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: కోర్టుకు హాజరైన హీరో రానా! కేసు ఏమిటంటే?