పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలు పోషిస్తూ నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. మాళయాళ సూపర్ డూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషీయమ్ చిత్రాన్ని తెలుగులో రీమెక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బడా హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు.
కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా..తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్‌తో కాస్త వివాదం రాజుకుంటోంది. ఆ వివాదం ఏంటంటారా..? ఈ మూవీలో రానా, పవన్ ఇద్దరూ స్టార్ హీరోలు కలిసి నటస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్‌లో రానాను అస్సలు కూడా చూపించకపోవటంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఫైర్ అవుతున్నారు.
బాహుబలి వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ ఉన్న రానాను ఈ గ్లిమ్స్‌లో కాస్త పక్కకు పెట్టడంతో బల్లాలదేవ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మా హీరోను ఎందుకు పక్కకు పెట్టారంటూ రానా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ మూవీ గ్లిమ్స్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే గత చిత్రాలపై ఉన్న గ్లిమ్స్ వ్యూస్ రికార్డును భీమ్లా నాయక్ దాటేసి సరికొత్త రికార్డను నెలకొల్పింది.