సాయి పల్లవి.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ కి మించిన క్రేజ్ ఆమె సొంతం. అందం, అభినయం, డాన్స్ అన్నింటికీ మించి ఆమె వ్యక్తిత్వానికి ఎంతో మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె క్యారెక్టర్లు ఎంచుకునే విధానం, స్క్రీన్ మీద తనని తాను చూపించుకునే తీరు, రెమ్యూనరేషన్ కోసం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు ఎంచుకోవడం, ఫేమ్ కోసమో- మనీ కోసమో ఐటం సాంగ్స్ లాంటివి చేయకుండా ఉండటం.. ఇలా అన్నీ కలిపి ఆమెకు ఇంతటి స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. సాయి పల్లవి క్రేజ్, స్టార్ డమ్ గురించి అంతా మాటల్లోనే విన్నారు. కానీ, తాజాగా ఇండస్ట్రీలో ఆమెకున్న స్థానం ఏంటో విరాట పర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చూశారు.
కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో జూన్ 5న సాయంత్రం విరాట పర్వం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్లాన్ చేయగా.. ప్రకృతి మాత్రం వారికి అనూకూలించలేదు. హోరు గాలికి స్టేజ్ పై ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్ కూడా పడిపోయింది. కానీ, దగ్గుబాటి రానా, సాయి పల్లవి మాత్రం ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరచకూడదని నిర్ణయించుకుని కాసేపు మాట్లాడారు. కానీ, ఆ కార్యక్రమాన్ని మాత్రం మధ్యలోనే నిలిపివేయక తప్పలేదు.
Only love to you all Kurnool ❤️@RanaDaggubati & @Sai_Pallavi92 address the crowd despite of heavy rains..
👉 https://t.co/JXFzWwPo32#VirataParvam IN CINEMAS JUNE 17 🔥@nanditadas @venuudugulafilm #SureshBobbili @DivakarManiDOP @dancinemaniac @SLVCinemasOffl @SureshProdns pic.twitter.com/oVv6AtD5bD
— Suresh Productions (@SureshProdns) June 5, 2022
ఈ కార్యక్రమంలో సాయి పల్లవి మాట్లాడే సమయంలో వర్షం కూడా మొదలవ్వడంతో రానా వచ్చి సాయి పల్లవికి గొడుగు పట్టాడు. అందులో గొప్పేముంది అనుకోవచ్చు.. నిజానికి భాష ఏదైనా సినిమా ఇండస్ట్రీ అనగానే హీరోలకే పెద్ద పీట వేస్తారు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించాలంటే ఏ స్టార్ హీరో ముందుకురాడు. అలాంటి చోట సాయి పల్లవికి రానాలాంటి హీరో వర్షంలో గొడుగు పట్టుకున్నాడు అంటే? ఆమెకున్న క్రేజ్ మాత్రమే కాదు.. ఆమెకు ఇండస్ట్రీలో ఉన్న రెస్పెక్ట్ చూడచ్చు.
KURNOOL people full on Josh at #VirataParvam Trailer Launch Event..✨ 🤩
Lights went off due to weather issues but they lighten up their mobiles and waiting for the arrival of @RanaDaggubati & @Sai_Pallavi92 😍😍Watch Live here 👇
▶️https://t.co/tC4CLSDFwY@SLVCinemasOffl pic.twitter.com/8bHbJgXf84— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 5, 2022
నిజానికి స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న ఎందరో కంటే.. సాయి పల్లవి ఎంతో గ్రేట్ అంటూ ఆమె ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఆమె నటనకే కాదు, ఆమె మాటలు, అణుకువ, అమాయకత్వం అన్నింటికి అభిమానులం అంటూ చెబుతున్నారు. అంతేకాకుండా వారి అభిమాన తారకు గొడుగు పట్టుకున్న రానా దగ్గుబాటి గొప్ప వ్యక్తిత్వంపై సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సాయి పల్లవికి రానా గొడుగు పట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.