‘బిగ్ బాస్5’ సీజన్ లో రమ్యకృష్ణ మరోసారి హోస్ట్ గా మారబోతోందని తెలుస్తోంది. అయితే తెలుగులో కాదులెండి. ఈసారి తమిళ్ బిగ్ బాస్ కు రమ్యకృష్ణ హోస్ట్ గా మారబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కమల్ హాసన్ కరోనా బారిన పడిన నేపథ్యంలో బిగ్ బాస్ రమ్యకృష్ణను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందుకు రమ్యకృష్ణ కూడా ఓకే అనేసిందని టాక్. మొదట కమల్ హాసన్ ప్లేస్ లో శృతిహాసన్ వస్తుందనే వార్తలు వినిపించాయి. కానీ, శృతిహాసన్ హోస్ట్ చేయడంలేదని.. రమ్యకృష్ణ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గతంలో రమ్యకృష్ణ బిగ్ బాస్ తెలుగుకు వీకెండ్ ఎపిసోడ్స్ కు హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. అప్పుడు నాగార్జున తన 60వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా టూర్ కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వీకెండ్ ఎపిసోడ్స్ కోసం రమ్యకృష్ణ హోస్ట్ గా చేశారు. ఆల్రెడీ అనుభవం ఉన్న రమ్యకృష్ణనే తమిళ్ బిగ్ బాస్ కు కరెక్ట్ అని భావించిన నిర్వాహకులు ఆమెను సంప్రదించినట్లు.. అందుకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.