ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా నటుడు నరేష్ – పవిత్రా లోకేష్ తమ ముద్దు వీడియోతో అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాని ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా నరేష్, పవిత్రా ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఆ వీడియో చూశాక ఎక్కువ శాతం నరేష్ పై, పవిత్రపై విమర్శలు ఎక్కువయ్యాయి. కానీ.. అవేవి లెక్క చేయకుండా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుంటూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నరేష్ పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఇంటర్వ్యూలో నరేష్ గురించి రమ్య రఘుపతి మాట్లాడుతూ.. ‘అతను చాలా దుర్మార్గుడు. అతనితో నాది మూడో పెళ్లి. అయినా పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఎంతోమందితో ఎఫైర్స్ పెట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. తప్పులన్నీ తను చేసి.. నాపై ఆరోపణలు చేశాడు. అందుకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. తను కావాలనే నన్ను వదిలించుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఇలా చేస్తున్నాడు. కానీ.. నేను పెళ్లి చేసుకునే ముందే చెప్పాను. పెళ్లి తర్వాత ఎఫైర్స్.. డివోర్స్ పెట్టుకోకూడదని. అయినా సరే పెళ్లయ్యాక ఎన్నోసార్లు వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకొని దొరికి.. ఇంటికి వచ్చాక సారీ చెబుతూ కాళ్ళు, వేళ్ళు పట్టుకుని ఏడ్చేవాడు.” అని చెప్పింది.
ఆమె ఇంకా చెబుతూ.. ‘నరేష్ ని నేను భార్యగా కాదు.. ఓ తల్లిగా ట్రీట్ చేస్తున్నాను. అందుకే ఇన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వస్తున్నాను. నేనిప్పటికీ చెబుతున్నాను నేను నరేష్ ని వదిలిపెట్టను. అతనికి విడాకులు ఇవ్వను. ఎందుకంటే.. మాకు పదేళ్ల బాబు ఉన్నాడు. వాడు అమ్మ నాన్న ఇద్దరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే.. నరేష్ ఇలా. నేను నా బాబు ఆ ఇంట్లో నుండి కూడా బయటికి వెళ్ళం. రోజులు గడుస్తున్నకొద్దీ నరేష్ దారుణాలు పెరిగిపోతున్నాయి. నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని ఇప్పటిదాకా నరేష్ చేయని ప్రయత్నం, పనులు లేవు. ఇన్నాళ్లు మామయ్య కృష్ణ గారి పరువు పోకూడదని ఓపిక పట్టాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు నిజం చెప్పాల్సి వస్తోంది. నా నుండి విడాకులు తీసుకోవాలని నరేశ్ ట్రై చేస్తున్నాడు. కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. అన్నీ కోర్టులోనే తేల్చుకుంటాను.” అని రమ్య తెలిపారు. మరి నరేష్ – పవిత్రా లోకేష్ – రమ్య రఘుపతిల ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.