టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్– క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర పేర్లు గత కొన్ని రోజులుగా పలు కారాణాల రీత్యా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. వారి విషయంపో నరేశ్ మూడో భార్య పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై నరేశ్- పవిత్ర లోకేశ్ కూడా విడివిడిగా స్పందించారు. అయితే ఆదివారం మైసూర్‌లో నరేశ్- పవిత్ర లోకేశ్ హోటల్ లో ఉండగా రమ్య రఘుపతి అక్కిడికి చేరుకున్నారు. హోటల్ నుంచి బయటకు వెళ్లబోతున్న నరేశ్- పవిత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో చెప్పుతో పవిత్రా లోకేశ్ కొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఆమెను పోలీసులు నిలువరించి బయటకు పంపేశారు.
నరేశ్ కూడా రమ్యను ఉడికించే ప్రయత్నం చేశాడు. లిఫ్ట్ లో వెళ్తూ ఈలలు వేస్తూ.. గేలి చేసే ప్రయత్నం చేశాడు. రమ్యను చీటర్, ఫ్రాడ్ అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత రమ్య రఘుపతి ఈ ఘటనపై స్పందించారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఒకే రూమ్ లో ఉంటారా అంటూ ప్రశ్నించారామె? నరేశ్- పవిత్రా లోకేశ్ రిలేషన్ గురించి స్పందిస్తూ రమ్య రఘుపతి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
“ఈరోజు నరేశ్- పవిత్రా లోకేశ్ ఒకే రూమ్ లో చెక్ ఇన్ అయ్యారు. నా దగ్గర అన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను అన్నీ ఆధారాలు సేకరించాను. బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇలా ఒకే హోటల్ రూమ్ లో ఉంటారా? దీనిని ఫ్రెండ్ షిప్ అంటారా? వాళ్లు అడ్డుకోవాల్సిన పోలీసులు రివర్స్ లో నన్నే అడ్డుకున్నారు. వారిని దగ్గరుండి బయటకు పంపారు. అన్యాయం నాకు జరిగితే పోలీసులు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు.”
“ఈరోజు నాకు అన్యాయం జరిగింది. కానీ, నాకు ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. పైగా నా క్యారెక్టర్ ను తప్పుబడుతున్నారు. నన్ను చీటర్, ఫ్రాడ్ అని కామెంట్ చేస్తున్నారు. నేను వారిపై దాడి చేయడానకి రాలేదు. నాకు న్యాయం చేయమని అడగడానికి వచ్చాను. ఇప్పుడు అందరూ చూశారు కదా వాళ్లిద్దరూ ఒకే రూమ్ నుంచి బయటకు రావడం. నాకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నారు. నాకు నా భర్త కావాలి.. అందుకు నేను న్యాయపరంగా పోరాటం చేస్తాను. నేను హైదరాబాద్ వెళ్లి ప్రెస్ మీట్ ఈ విషయాన్ని నిలదీస్తాను” రమ్య రఘుపతి వ్యాఖ్యానించారు. రమ్య రఘుపతి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.