నటీనటులు కొందరు.. తమ పనిపట్ల చాలా డెడికేషన్ చూపిస్తుంటారు. దెబ్బలు తగిలినా సరే షూటింగ్స్ కి అటెండ్ కావడం, గర్భంతో ఉన్నాసరే తమ పాత్రకి సంబంధించిన సీన్స్ త్వరగా పూర్తయ్యేలా చూడటం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాయి. ఇక ఇలాంటి సందర్భమే తనకు ఎదురైందని నటి రమ్యకృష్ణ చెప్పింది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే మాస్ సాంగ్ కి స్టెప్పులేశానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఈ విషయాన్ని రమ్యకృష్ణ ఎందుకు బయటపెట్టింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ రమ్యకృష్ణ అంటే ఎవరైనా సరే టక్కున గుర్తుపట్టేస్తారు. హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపిన ఈమె.. ప్రస్తుతం కీలకపాత్రలు చేసే క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతోంది. ఈ జనరేషన్ వాళ్లకు రమ్యకృష్ణ అంటే ‘బాహుబలి’లోని శివగామినే గుర్తొస్తుంది. ఈ పాత్ర ఆమెని మరోస్థాయిలో నిలబెట్టింది. తాజాగా రిలీజైన ‘లైగర్’లోనూ హీరో తల్లిపాత్రలో కనిపించి రీసౌండ్ తెప్పించింది. ఒకప్పుడు రమ్యకృష్ణ అంటే కుర్రాళ్లంతా ఫుల్ ఫిదా అయ్యేవారు. అంతలు డ్యాన్సులు, గ్లామర్ తో మెప్పించింది.
ప్రస్తుతం మాత్రం పలు సినిమాల్లో కీలకపాత్రలు చేస్తూ, టీవీ షోల్లోనూ జడ్జిగా మెరుస్తోంది. తెలుగులో ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘డాన్స్ ఐకాన్’ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షోలో తన గురించి ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ ని తాజాగా బయటపెట్టింది. ఇదిలా ఉండగా.. ఈ షోలోని కంటెస్టెంట్స్, ‘నా అల్లుడు’ సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ ‘సయ్యా సయ్యారే’కు డ్యాన్స్ చేశారు. ఈ ఫెర్ఫామెన్స్ పూర్తయిన తర్వాత.. ఈ పాట గురించి రమ్యకృష్ణ మాట్లాడింది. ఈ సాంగ్ కి డ్యాన్స్ చేసే టైంలో తను నాలుగు నెలల గర్భవతిని అని, అందుకే ఈ పాటని అంత త్వరగా మరిచిపోనని చెప్పింది. ఆ గీతంలో ఎన్టీఆర్ ఎనర్జీ, మాస్ స్టెప్పులు వేరే లెవల్లో ఉంటాయని రమ్యకృష్ణ రివీల్ చేసింది. తారక్ ‘సింహాద్రి’ సినిమాలోనూ రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేసి కుర్రాళ్లను మైమరిచిపోయేలా చేసింది. మరి రమ్యకృష్ణ చెప్పిన సీక్రెట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.