ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన రమేష్ బాబు హీరోగా నిలబడలేక పోయారు. తరువాత ప్రొడ్యూసర్ గా మారి మహేష్ బాబుతో కొన్ని సినిమాలు నిర్మించారు. కానీ అవి అనుకున్న మేర సక్సెస్ కాలేదు. ఇక ఆ తర్వాత నుంచి రమేష్ బాబు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆయన భార్య, బిడ్డల గురించి కూడా ఎవరికి పెద్దగా తెలియదు. ఇక రమేష్ బాబు భార్య పేరు మృదుల, వీరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ, వీరు ఎక్కువగా మీడియా ముందుకు రారు. ఘట్టమనేని ప్యామిలీ ఫంక్షన్స్ లో కూడా వీరు కనిపించింది తక్కువే.
ఇక సూపర్ స్టార్ కృష్ణ-ఇందిరా దేవి ఐదుగురు సంతానంలో రమేష్ బాబు పెద్దవాడు. ఆయన తరువాత మంజుల, పద్మావతి, మహేష్ బాబు, ప్రియదర్శిని ఉన్నారు. ఈ క్రమంలో రమేష్ బాబు మృతి తర్వాత తొలిసారి ఆయన భార్య, కుమారుడు ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఈ వీడియోలో రమేష్ బాబు భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.