మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఫిన్ లాండ్ వెకేషన్ కి వెళ్లాడు. ఎల్లప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే చరణ్.. దాదాపు రెండేళ్ల తర్వాత తనతో ఫిన్ లాండ్ దేశానికి టూర్ కి వచ్చాడని ఉపాసన తెలిపింది. ఎప్పుడూ సినిమా హడావిడిలో ఉండే సినీతారలు కాస్త తీరిక దొరికినా టూర్లకు వెళ్తుంటారు. ఇటీవల చరణ్.. డైరెక్టర్ రాజమౌళితో ‘RRR’ సినిమా చేశాడు. ఆ సినిమా మార్చి 25న విడుదలకు రెడీ అవుతోంది.
RRR షూటింగ్ ముగియడంతో ప్రస్తుతం చరణ్.. డైరెక్టర్ శంకర్ తో మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయి బ్రేక్ రావడంతో భార్యతో కలిసి వెకేషన్ కి వెళ్లినట్లు సమాచారం. అయితే.. ఈ మెగా కపుల్ ఫిన్ లాండ్ లో ఎయిర్ పోర్ట్ దగ్గరనుండి మంచు కొండల వరకు ఎంజాయ్ చేసిన ఫన్నీ మూమెంట్స్ వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. మరి ఉపాసన, చరణ్ స్పెషల్ ఫన్నీ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#RamCharan and #Upasana refreshed and rejuvenated after their amazing vacay in Finland! ❄️@AlwaysRamCharan @upasanakonidela #VacayGoals #TeluguFilmNagar pic.twitter.com/gp93Id2PUE
— Telugu FilmNagar (@telugufilmnagar) March 14, 2022