యంగ్ టైగర యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా దెబ్బకు అనేక రికార్టులు కూడా బద్దలయ్యాయి. ఎంతో మంది హాలీవుడ్, ఇతర దేశాల సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఈసినిమాను పొగుడుతూ ట్వీట్లు కూడా చేశారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆస్కార్-2023కి వెళ్లే నటీనటులు సినిమాల గురించి ప్రెడిక్ట్ చేస్తూ ఓ వెరైటీ అనే వెబ్ సైట్ లో కొన్ని పేర్లు కనిపించాయి. అందులో ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రామ్ చరణ్ కు అవకాశం దక్కింది.
ప్రతి ఏడాది ఆస్కార్ నామినేషన్స్ ప్రకటించడానికి ముందు ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది? అంటూ “ప్రెడిక్షన్స్”చెప్పడం జరుగుతూనే ఉంటుంది. అయితే.. ఉత్తమ నటుడి కేటగిరిలో ఈ ఏడాది ఎవరెవరు ఉండొచ్చని లిస్టును ‘వెరైటీ’ సంస్థ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో పోటీగా హాలీవుడ్ హీరోలతో పాటు జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా పేర్కొన్నారు. అంతే కాకుండా పలు ఇతర విభాగాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ జాబితాలో ఉన్నట్లు ఆ సైట్ తెలిపింది. తాజాగా ఉత్తమ నటుడు కేటగిరీలో రామ్‌చరణ్ పేరు కూడా ఉన్నట్లు ఆ వెబ్‌సైట్ రాసింది. దీంతో మెగా అభిమానుల సంతోషానికి హద్దు లేకుండా పోయింది.
ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’, ‘రోబో’ వంటి పాన్ ఇండియా చిత్రాలకి వీఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్‌గా పనిచేసిన శ్రీనివాస్ మోహన్ ట్వీట్ చేశాడు. దీంతో తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు రామ్‌చరణ్ ఆస్కార్స్‌కి నామినేట్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఆ సైట్ పేర్కొన్న ఆయా విభాగాల్లో నామినేట్ అయ్యే అర్హత ‘ఆర్ఆర్ఆర్’కి ఉందని రాసుకొస్తున్నారు. మరి ఆర్ఆర్ఆర్, మెగా అభిమానలకి ఇదైతే గుడ్ న్యూస్ గానే చెప్పాలి. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
RRR – Oscars predictions @Variety
Best International Feature
Best Director – @ssrajamouli
Best Actor – @tarak9999 @AlwaysRamCharan
Best Original Screenplay
Best Original Song – Dosti@VarianceFilms @DVVMovies @RRRMovie https://t.co/6khRnBkbK4
— Srinivas Mohan (@srinivas_mohan) September 16, 2022
Senior Member Of Hollywood Critics Association.
15 Years Of Experience As Oscar & Emmys Awards Analyst.
Has to Make Corrections in the Predictions for ONE MAN.
After the Demand of Audience, PEOPLE’s CHOICE enters @Variety‘s Predictions 🔥#RamCharanForOscars @AlwaysRamCharan pic.twitter.com/KVziOa4jZx
— Trends RamCharan™ (@TrendsRamCharan) September 16, 2022