RRR.. ఓ ఏడాదిన్నర కాలంగా పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. పీరియాడికల్ పాన్ ఇండియా మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన RRR రిలీజ్ డేట్ మార్చి 25న ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రబృందం రోర్ ఆఫ్ RRR పేరుతో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రాంచరణ్.. RRR మూవీ, డైరెక్టర్ రాజమౌళి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు.రాంచరణ్ మాట్లాడుతూ.. ‘ముందుగా సల్మాన్ ఖాన్ కి థాంక్యూ. కరణ్ జోహార్ సర్ థాంక్యూ. అలియా లాంటి వెరీ టాలెంటెడ్ హీరోయిన్ తో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలని ఉంది. మరి అలియా డేట్స్ ఇస్తే తప్పకుండా చేస్తా. డైరెక్టర్ రాజమౌళి గారి గురించి చెప్పాలంటే.. నేను రాజమౌళి సినిమా అనగానే నటుడిగా పెద్ద సినిమా అని రాలేదు. ఓ స్టూడెంట్ గా RRR సినిమాలో చేరాను. నాకు మగధీర నుండి రాజమౌళి గారు ఓ గురువుగా సరైన దారి చూపించారు. ఎంతో నేర్చుకున్నాను. థాంక్యూ సర్. ఇక చివరిగా మై బ్రదర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ కి నేను థాంక్యూ చెప్పను తమ్ముళ్లు’ అంటూ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. ప్రస్తుతం రాంచరణ్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్తి వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.