గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ‘రామబాణం’ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నారు హీరో గోపిచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి.
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య అప్ కమింగ్ హీరోయిన్ల సందడి బాగా పెరిగిపోయింది. 2017 లో గల్ఫ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన డింపుల్ హయాతి తర్వాత 2019 లో యురేకా మూవీలో నటించింది. వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ మూవీలో ‘జర్ర జర్ర’ ఐటమ్ సాంగ్ తో మెప్పించింది. ఈ మాస్ మహరాజ రవితేజ నటించిన ‘ఖిలాడి’ మూవీలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన ‘రామబాణం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ సభ్యులు ప్రమోషన్ బిజీలో ఉన్నారు.
మ్యాచో హీరో గోపీచంద్, అందాల భామ డింపుల్ హయాతి ప్రస్తుతం ‘రామబాణం’ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు శ్రీవాస్ ‘రామబాణం’ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ప్రెస్ మీట్ లో అభిమాని అడిగిన ప్రశ్నకు హీరోయిన్ డింపుల్ హయాతి దిమ్మతిరిగే జవాబు ఇచ్చింది. ఈ మూవీ గురించి పలు ప్రశ్నలు అడుగున్న సమయంలో ఓ అభిమాని మేడం.. మీరు నాకు ఓ విషయంలో పరిమిషన్ ఇస్తారా అని అడిగాడు. దీనికి హయతి ఏంటో చెప్పండి అని అనడంతో.. మీకు నేను గుడి కట్టాలని అనుకుంటున్నా.. అది పాల రాయితో కట్టాలా? ఇటుకలతో కట్టాలా? అని ప్రశ్నించాడు. దీనికి డింపుల్ హయాతి సమాధానం ఇస్తూ.. నాకు బంగారంతో గుడి కట్టండి చాలా బాగుంటుంది అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్న అభిమానులు అంతా ఒక్కసారే నవ్వారు.
మరో అభిమాని.. ఈ మద్య మీకు సంబంధించిన ఎన్నో వైరల్ న్యూస్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. మీపై ట్రోల్స్ వస్తే ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించాడు. దీనికి డింపుల్ హయాతీ సమాధానం ఇస్తూ.. మొదట్లో నాకు ట్రోల్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు.. కానీ ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అనుకున్నేవాళ్లు అనుకున్నంత అంటూ వదిలేస్తున్నాను.. ఒక పరిధి దాటనంత వరకు ట్రోల్స్ ఫన్నీగా.. ఇష్టంగానే ఉంటాయి. ఒకవేళ అవి హద్దులు దాటితే పరిస్థితి వేరుగా ఉంటుంది.. ఎందుకంటే మేం కూడా మనుషులమే కదా అంటూ కూల్ గా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.