నా సంగతి ఇది. నా తల్లి ఇది. నేను ఇది. బాగా చూసుకుంటాను. ఏదో ఒక వీక్ మూమెంట్‌లో ఒప్పేసుకుంది. చిన్న పిల్ల. అప్పుడు ఆమెకు 18 సంవత్సరాలు. నాకు 24 సంవత్సరాలు..
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ ప్రియదర్శిని. మీడియా రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారాయన. గతంలో రామ్ ఓ ప్రముఖ న్యూస్ పేపర్‌లో ‘లవ్ డాక్టర్’ పేరిట ఓ కాలమ్ నిర్వహించే వారు. యువతకు ప్రేమకు సంబంధించిన సలహాలు ఇచ్చేవారు. అలాంటి ఆయన జీవితంలోనూ ఓ లవ్‌స్టోరీ ఉంది. తన ప్రేమ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు. ఆయన సుమన్ టీవీ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. ‘‘ నేను ప్రేమిస్తున్న సంగతి ఆమెకు చెప్పాను. కుదరదు అంది. నేను బాగా చూసుకుంటాను.
నా సంగతి ఇది. నా తల్లి ఇది. నేను ఇది. బాగా చూసుకుంటాను. ఏదో ఒక వీక్ మూమెంట్‌లో ఒప్పేసుకుంది. చిన్న పిల్ల. అప్పుడు ఆమెకు 18 సంవత్సరాలు. నాకు 24 సంవత్సరాలు. ఆ పాప ఇంకొంచెం పెద్దది అయితే నన్ను చేసుకునేది కాదు. ఆ పాపను పెళ్లి చేసుకోవాలని చాలా చేశాను. నాకు పేక ఆడటం రాదు. నాకు ఏ అలవాట్లు లేవు. ఆ పాప ఉండే కాలనీలో వాళ్ల నాన్న ఇద్దరు ముగ్గురితో తరచుగా పేక ఆడేవారు. నేను పేక ఆడటం నేర్చుకుని వాళ్ల దగ్గరకు వెళ్లాను. మా పాప వాళ్ల నాన్నతో స్నేహం చేయటానికి. ఆయన పేరు ఠాకూర్ చంద్రమౌళేశ్వర సింగ్ చౌహాన్ ఆయన పేరు. ఆయనతో పేక ఆడేవాడిని.
ఆయనతో స్నేహం చేయటానికి కావాలని ఓడిపోయేవాడిని. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఓ రోజు మేమిద్దరం ప్రేమించుకుంటున్న సంగతి ఆయనకు చెప్పాను. ఆయన కుదరదు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాను. వైఎస్సార్ దగ్గరుండి మా పెళ్లి చేయించారు. ఓ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి నా కాలర్ పట్టుకున్నాడు. ఆయన కోపంతో ఊగిపోయాడు. వైఎస్సార్ నన్ను ఏమీ అనవద్దని అన్నాడు. మంచి ప్రేమ, చెడ్డ ప్రేమ అన్నదాన్ని కాలం నిర్ణయించదు. మనిషి చెడ్డోడు. ఆడపిల్ల చెడ్డది కాదు కానీ, మగాడు చెడ్డోడు’’ అని అన్నారు.