Ram Prasad: బుల్లితెరపై బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరి గురించైనా ప్రస్తావన తెస్తే.. ముందుగా చెప్పుకునేది సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్‌ల గురించే. జబర్థస్త్ షోతో ఫేమ్ తెచ్చుకున్న ఈ నటులు.. తమ వైవిధ్యమైన స్కిట్లతో ఆ షోకే ఫేమ్ తెచ్చారు. ఒకనొక టైంలో వీరి స్కిట్ల కోసమే జనం జబర్థస్త్ చూసేవారంటే అందులో అతిశయోక్తి లేదు. దాదాపు 10 సంవత్సరాలుగా షోలో స్కిట్లు చేస్తూనే ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముగ్గురు కలిసి స్కిట్లను ముందుకు తీసుకెళ్లేవారు. స్కిట్లలో కథ ఏమీ లేకపోయినా వీరు ముగ్గురు ఉంటే ఆ స్కిట్‌లో ఫన్ జెనరేట్ అయ్యేది. అన్ని రోజులు ఒకేలా ఉండవుగా.. అవకాశాల కోసమే.. లేక వేరే కారణమో తెలీదు కానీ, షోనుంచి సుడిగాలి సుధీర్ బయటకు వచ్చేశాడన్న వార్తలు వస్తున్నాయి.
ఆ వార్తలు నిజమే అన్నట్లుగా గత కొద్దిరోజులనుంచి సుడిగాలి సుధీర్ జబర్థస్త్‌లో కనిపించటం లేదు. ప్రస్తుతం గెటప్ శ్రీను కూడా షోను నుంచి బయటకు వచ్చేశాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆటో రామ్ ప్రసాద్ మాత్రమే షోలో మిగిలిపోయాడు. ఒక్కడే స్కిట్లు చేస్తూ ఏదో మ్యానేజ్ చేస్తున్నాడు. కానీ, ముగ్గురు కలిసి ఉన్నప్పుడు వచ్చినంత ఫన్ ఇప్పుడు రావటం లేదు. ముగ్గురు ఉన్నప్పుడు చేసినంత అవలీలగా స్కిట్ చేయలేకపోతున్నాడు రామ్ ప్రసాద్. ఇదే విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తావించారు. ‘‘ఎఫ్ 3’’ ప్రమోషన్లలో భాగంగా బబర్థస్త్‌కు వచ్చిన ఆయన ఆటో రామ్ ప్రసాద్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘‘ నీ పేరే ఆటో కదా?.. ఫస్ట్ టైం అనుకుంటా నీ వీల్స్ లేకుండా నువ్వో స్కిట్ చేస్తున్నావ్. ఎలా ఫీలవుతున్నావు వాళ్లిద్దరూ లేకుండా?..’’ అని ప్రశ్నించారు.
రామ్ ప్రసాద్ సమాధానం ఇస్తూ.. ‘‘ నాకు తెలిసి ఈ రోజు అనుకుంటా?.. అదే! వాళ్లిద్దరూ ఉన్నారనుకోండి.. ఆ కోఆర్డినేషనే వేరు. ఒరే బావ! నీ డైలాగ్ అది. నీ డైలాగ్ ఇది.. అని అంటే.. మాకు తెలియకుండా ఆ మ్యాజిక్ జరిగిపోతుంది మా ముగ్గురి మధ్యలో.. అలాంటిది ఆ ఇద్దరు లేకపోవటంతో..’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే, సుధీర్, శ్రీనులు షోలో లేకపోవటం రామ్ ప్రసాద్ ఒక్కడికేకాదు.. చూస్తున్న వారికి కూడా ఓ వెలితిగానే అనిపిస్తోంది. అలాగని సుధీర్, శ్రీనులు రామ్‌ప్రసాద్‌ను వదిలేసి ఎవరి దారి వారు చూసుకున్నారనటం.. స్వార్థపరులు అని నిందించటం అవివేకం తప్ప మరొకటి కాదు.. వాళ్లు ఎందుకు షోలో లేరో ఆ ఇద్దరికి, రామ్ ప్రసాద్‌కు తప్ప సరైన కారణం బయటనుంచి చూస్తున్న వారికి తెలీదు. అలాంటప్పుడు దాని గురించి అనవసరపు వ్యాఖ్యానాలు చేయటం తగదన్నది సినీ విమర్శకుల అభిప్రాయం. ఎమో!! త్వరలో ఆ ముగ్గురు కలిసి మళ్లీ స్కిట్లు చేస్తారేమో.. మరి, ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Srikanth Reddy: శ్రీకాంత్ రెడ్డి పైత్యం: RGV నా ముందు బచ్చాగాడు.. నాది హాలీవుడ్ రేంజ్!